
‘హిట్ 3’ చిత్రానికి తమ అంచనాలకు మించి ఆడియెన్స్ వస్తున్నారని దర్శకుడు శైలేష్ కొలను అన్నాడు. నాని హీరోగా నటించి నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలై థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శైలేష్ మాట్లాడుతూ ‘ప్రేక్షకుల నుంచి మేం ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి టార్గెట్ ఆడియెన్స్ మాత్రమే ఉంటారని ముందు అనుకున్నాం. అయితే అర్జున్ సర్కార్ క్యారెక్టర్ లేడీస్‌కి, ఫ్యామిలీస్‌కు ఎక్కువగా నచ్చడం సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఇందులో నాని గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో ‘హిట్2’ చివర్లో ఒక గ్లింప్స్‌లా చూపించా.
అప్పుడే ఆయన పాత్రపై అందరికీ ఒక అవగాహన వచ్చింది. నాని గారిని ఇలాంటి వయెలెంట్ క్యారెక్టర్‌లో చూడటానికి ప్రేక్షకులు ఎక్సయిట్‌మెంట్‌తో థియేటర్స్‌కు వస్తున్నారు. ఈ చిత్రంలో చూపించిన డార్క్ వెబ్ సమస్య చాలా పెద్దది. నిజంగా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ దీని మీద వర్క్ చేస్తోంది. ఈ సినిమా కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి హెల్ప్ చేశారు.
శ్రీనిధి శెట్టితో పాటు రావు రమేష్, సముద్రఖని చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా నటించారు. అడివి శేష్ క్యామియో అందర్నీ థ్రిల్ చేసింది. విశ్వక్‌సేన్‌ను ఇంకా బిగ్గర్ కాన్వాస్ లో చూపించాలనే ఆలోచన ఉంది. కథలో ఒక క్యారెక్టర్ రావడమనేది ఆర్గానిక్‌గా కుదరాలి. హిట్ 6 లేదా 7 లో అందరు హీరోల్ని ఒక ఫ్రేమ్ లోకి తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఇక ‘హిట్ 4’లో కార్తిని రూటేడ్‌గా చూపించబోతున్నా’ అని చెప్పాడు.