వాట్ ఏ క్లీనింగ్..దీనితో మీ కళ్ళజొడును క్లీన్ చేస్తే..!

వాట్ ఏ క్లీనింగ్..దీనితో మీ కళ్ళజొడును క్లీన్ చేస్తే..!

కళ్లజోడు, జ్యువెలరీ లాంటి వాటిని క్లీన్‌‌ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. విరిగిపోవడమో, పాడైపోవడమో జరుగుతుంది. ఆ ఇబ్బంది రాకుండా ఈ పోర్టబుల్ అల్ట్రాసోనిక్ క్లీనర్‌‌‌‌ని వాడాలి. దీన్ని హైవేర్ అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తెచ్చింది. అల్ట్రాసోనిక్‌‌ క్లీనింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది ఒక రకమైన ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్‌‌ చేస్తుంది. ఆ హై -ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ వల్ల 50–500um బుడగలు ఏర్పడతాయి. 

అవి సౌండ్‌‌ ప్రెజర్‌‌‌‌ వల్ల పగిలిపోతాయి. దాంతో ఆ నీళ్లలో ఉండే వస్తువు క్లీన్‌‌ అవుతుంది. ఈ క్లీనర్​ను ఇన్‌‌స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. రెండు ఏఏఏ(3ఎ) బ్యాటరీలు వేసి, పైన ఉన్న తొట్టె లాంటి దాంట్లో నీళ్లు నింపాలి. క్లీన్‌‌ చేయాలి అనుకున్న వస్తువుని అందులో వేసి స్విచ్​ ఆన్​ చేయాలి. ఐదు నిమిషాల్లో క్లీన్ చేసేస్తుంది. జ్యువెలరీ, కళ్లద్దాలు, రిస్ట్​ వాచ్‌‌ స్ట్రాప్​, కట్టుడు పళ్ళు, టేబుల్‌‌వేర్, మేకప్ బ్రష్‌‌ లాంటి వాటన్నింటినీ ఇందులో క్లీన్‌‌ చేయొచ్చు. ఏ వస్తువునైనా 360 డిగ్రీల్లో... అంటే అన్ని వైపులా శుభ్రం చేస్తుంది. 

ధర :489 రూపాయలు