
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. హంద్వారాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ మెహ్రజుద్దీన్ హల్వాయ్ అలియాస్ ఉబైద్‌తో పాటు మరో ఉగ్రవాది బుర్హన్ వనీని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఉబైద్ చాలా ఏళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఉబైద్ చాలా నేరాల్లో భాగస్వామిగా ఉన్నాడని ఆయన చెప్పారు. భద్రతా బలగాలకు ఇదో పెద్ద సక్సెస్ అన్నారు ఐజీ విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.