
హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 30.
పోస్టుల సంఖ్య : 11
పోస్టులు : ప్రొడక్షన్ అసిస్టెంట్ 08, సీనియర్ ప్రొడక్షన్ అసిస్టెంట్(ఫార్మా) 01, ల్యాబ్ అనలిస్ట్(కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ) లేదా ల్యాబ్ అనలిస్ట్(ఫార్మా) 01, అకౌంట్స్ ఆఫీసర్ 01.
ఎలిజిబిలిటీ : ప్రొడక్షన్ అసిస్టెంట్ పోస్టుకు ఫిట్టర్/ ఎలక్ట్రీషియన్ ట్రేడుల్లో ఐటీఐ, సీనియర్ ప్రొడక్షన్ అసిస్టెంట్(ఫార్మా) పోస్టుకు ఫార్మాసీలో డిప్లొమా, ల్యాబ్ అనలిస్ట్(కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ) లేదా ల్యాబ్ అనలిస్ట్(ఫార్మా) పోస్టుకు బీఎస్సీ కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ, బి.ఫార్మా, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుకు బి.కాంతోపాటు సీఏ– సీపీటీ లేదా ఎంబీఏ(ఫైనాన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
లాస్ట్ డేట్ : జులై 30.
సెలెక్షన్ ప్రాసెస్ : ఇంటర్వ్యూ ఆధారంగా. పూర్తి వివరాలకు lifecarehll.com వెబ్సైట్లో సంప్రదించగలరు.