పాక్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో హోంమంత్రి అమిత్ షా భేటీ

పాక్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో హోంమంత్రి అమిత్ షా భేటీ

పాకిస్తాన్ , పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలపై బుధవారం (మే7) తెల్లవారు జామున భారత వైమానిక దాడులు నిర్వహించింది. భారత వైమానిక, నేవీ, సైన్య సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తెల్లవారుజాము 1.44 గంటలకు ఆపరేషన్ సింధూర్ లోభాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమై లక్ష్యంతో దాడాలు చేశారు. ఏప్రిల్ 22 న పహల్గాంలో 26 మందిని బలిగొన్న ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ ప్రతీకార చర్యలు చేపట్టింది. 

ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. భారత్ అంతర్జాతీయ సరిహద్దుల వెంట సమన్వయాన్ని బలోపేతం,సంసిద్ధతను పెంచడంపై ఈ సమావేశం దృష్టి సారించింది.  ఈ సమావేశంలో జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్  పాల్గొన్నారు.

►ALSO READ | Operation Sindoor : కసబ్, హెడ్లీ ఉగ్ర శిక్షణ తీసుకున్న క్యాంప్స్ ఇవే.. మన దెబ్బతో నేల మట్టం

పాకిస్తాన్,పీఓకే అంతటా ఉగ్రవాద కార్యకలాపాలు, శిక్షణ ఇస్తున్న 9 ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా భారత్ సైన్యం దాడులు నిర్వహించింది. పహల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు నివాళిగా 'ఆపరేషన్ సిందూర్' అనే కోడ్‌నేమ్‌తో ఈ ఆపరేషన్ పేరు పెట్టారు.