రికార్డు స్థాయి ధరకు అమ్ముడైన మోకిలా ప్లాట్లు.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.121 కోట్లకు పైగా ఆదాయం

రికార్డు స్థాయి ధరకు అమ్ముడైన మోకిలా ప్లాట్లు.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.121 కోట్లకు పైగా ఆదాయం

హైద‌రాబాద్ : కోకాపేట నియో పోలిస్ భూములు అమ్ముడుపోయిన మాదిరిగానే.. మోకిలా ప్లాట్లు కూడా వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఐటీ కారిడార్‌కు స‌మీపంలోని మోకిలాలో మొద‌టి ద‌శ‌లో 50 ప్లాట్లను హెచ్ఎండీఏ సోమ‌వారం (ఆగస్టు 7న) వేలం వేసింది. ఈ ప్లాట్ల విక్రయంతో తెలంగాణ ప్రభుత్వానికి రూ.121.40 కోట్ల ఆదాయం వ‌చ్చింది. 50 ప్లాట్ల వేలంతో రూ.40 కోట్ల ఆదాయం వ‌స్తుంద‌ని ప్రభుత్వం అంచ‌నా వేసింది. కానీ.. ప్రభుత్వ అంచ‌నాకు మూడు రెట్లు అధికంగా ఆదాయం వచ్చింది. మోకిలాలో చ‌ద‌ర‌పు గ‌జం ధ‌ర గ‌రిష్ఠంగా రూ.1.05 ల‌క్షలు ప‌లికింది. చ‌ద‌ర‌పు గ‌జం ధ‌ర‌ క‌నిష్ఠంగా రూ.72 వేలు ప‌లికింది. స‌గ‌టున రూ.80,397 ప‌లికింది.

ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న మోకిలాలో హెచ్‌ఎండీఏ మొత్తం 165 ఎకరాల్లో భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తోంది. శంకర్‌పల్లి – మెహిదీపట్నం రోడ్డు నుంచి 2 కిలోమీటర్ల లోపలికి ఉన్న ఈ లేఅవుట్‌లో మొదటి దశలో 50 ప్లాట్లను విక్రయించింది.