లక్ష వినాయక మట్టి విగ్రహాల పంపిణీ

 లక్ష వినాయక మట్టి విగ్రహాల పంపిణీ

వినాయక చవితి పండగను పురస్కరించుకుని  హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. వినాయక చవితి పండగ సందర్భంగా లక్ష మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయనుంది.  ఈ మేరకు  వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రారంభించారు. ఆ తర్వాత తెలంగాణ సచివాలయంలో హెచ్ఎండిఏ అధికారులు సీఎస్ శాంతికుమారికి వినాయక మట్టి ప్రతిమను అందజేశారు.  

Also Read :- హైదరాబాద్ లో అందరూ చూడాల్సిన 7 గణేష్ మండపాలు ఇవే.

                                        
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా  సెప్టెంబర్ 14 నుంచి లక్ష  మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేస్తోంది.  సెప్టెంబర్ 14 నుంచి 17వ తేదీ  వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో  హెచ్ఎండిఏ వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ చేయనుంది.  40 కేంద్రాల్లో పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.