AA22xA6: అల్లు అర్జున్‌-అట్లీ మూవీ అప్డేట్.. బ్లాస్ట్కు సిద్ధంగా ఉండండి.. ఫొటోలు షేర్‌ చేసిన జపనీస్‌ కొరియోగ్రాఫర్‌

AA22xA6: అల్లు అర్జున్‌-అట్లీ మూవీ అప్డేట్.. బ్లాస్ట్కు సిద్ధంగా ఉండండి.. ఫొటోలు షేర్‌ చేసిన జపనీస్‌ కొరియోగ్రాఫర్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో AA22xA6 (వర్కింగ్ టైటిల్) మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అత్యున్నత స్థాయి సాంకేతిక విలువలతో, అంతర్జాతీయ స్థాయిలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం AA22 ఫుల్ స్వింగ్‌‌‌‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది.

ప్రముఖ జపనీస్‌-బ్రిటిష్ కొరియోగ్రాఫర్ హోకుటో కొనిషి తన ఇంస్టాగ్రామ్లో పలు ఫోటోలు షేర్ చేసి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ముంబై షూట్లో జరిగిన తెరవెనుక (BTS) ఫోటోలను పంచుకోవడంతో ఇపుడు AA22 వైరల్గా మారింది. అలాగే, ఈ ఫోటోలకు హుక్‌ (Breakdancer)పెట్టిన క్యాప్షన్ మూవీపై మరిన్ని అంచనాలు పెంచేలా చేసింది. 

ALSO READ : Dil Raju: పైరసీతో నిర్మాతలు కుదేలు.. సర్వర్‌ల హ్యాకింగ్‌పై దిల్ రాజు ఆవేదన!

‘‘భారతీయ సినిమాకు వర్క్‌ చేయాలని ఎప్పటినుంచో ఆసక్తిగా ఉన్నా. అల్లు అర్జున్ AA22 కోసం నెల రోజులు వర్క్‌ చేశా. టీమ్‌ అంతా ఈ షెడ్యూల్ కోసం ఎంతో కష్టపడింది. భారీస్థాయిలో, అదిరిపోయే టెక్నీకల్ అంశాలతో మూవీ రానుంది. ఇంతకుమించి ఇపుడే ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేను’’ అంటూ ఫోటోలను షేర్ చేశారు.

అల్లు అర్జున్‌తో పనిచేయడం ఆనందాన్ని కలిగించిందని, భారతీయ సినిమాలో భాగమవ్వడం గౌరవంగా ఉందని హుక్‌ నోట్ ద్వారా తన మాటల్లో రాసి అప్డేట్ పంచుకున్నారు. మొత్తానికి అల్లు అర్జున్తో హాలీవుడ్ ఐకానిక్ స్టెప్పులు వేయించనున్నాడు హుక్. ఇపుడు ఈ న్యూస్ ఐకాన్ ఫ్యాన్స్లో ఫుల్ ఖుషి నింపింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hok (@hok)

ఇటీవలే, అట్లీ బృందం ముంబైలో కీలక షెడ్యూల్ ముగించుకుంది. నెక్స్ట్ షెడ్యూల్ అబుదాబిలో ప్లాన్ చేశాడు అట్లీ. ప్రస్తుతం ఇక్కడ పలు ఇంట్రెస్టింగ్ లొకేషన్ల వేటలో ఉన్నట్లు సమాచారం. వచ్చే నెలలో షూటింగ్ తిరిగి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే, ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణే ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే విజయ్ సేతుపతి, రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. త్వరలో మేకర్స్ నుంచి ఓ స్పెషల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.