Dil Raju: పైరసీతో నిర్మాతలు కుదేలు.. సర్వర్‌ల హ్యాకింగ్‌పై దిల్ రాజు ఆవేదన!

Dil Raju: పైరసీతో నిర్మాతలు కుదేలు.. సర్వర్‌ల హ్యాకింగ్‌పై దిల్ రాజు ఆవేదన!

సినీ ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న పైరసీని అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. కట్టడి మాత్రం కావడంలేదు . సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతోందో, పైరసీ బెడద కూడా అంతే వేగంగా పెరుగుతోంది. దేశంలోనే అతి పెద్ద పైరసీ రాకెట్ ను లేటెస్ట్ గా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి , వారి నుంచిహార్డ్ డిస్కులు,  కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, ఇంటర్నెట్ కనెక్టివిటీలు స్వాధీనం చేసుకున్నారు. 

 డిజిటల్ ప్రొవైడర్ల సర్వర్‌ హ్యాక్

ఈ సందర్భంగా సినిమా పైరసీపై ప్రముఖ నిర్మాత, TFCC ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు. పైరసీ రాకెట్ ముఠాను ఆరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను అభినందించారు. పైరసీ వల్ల జరుగుతున్న నష్టం కేవలం నిర్మాతలను మాత్రమే కాక, ప్రభుత్వ ఆదాయాన్ని సైతం దెబ్బతీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ప్రదర్శనకు సంబంధించిన క్యూబ్ (Qube), యూఎఫ్‌ఓ (UFO) వంటి ప్రముఖ డిజిటల్ ప్రొవైడర్ల సర్వర్‌లను కూడా పైరసీ ముఠాలు హ్యాక్ చేస్తున్నాయని పోలీసుల విచారణలో తేలిందని దిల్ రాజు వెల్లడించారు. ఈ అక్రమాలకు పాల్పడుతున్నవారిలో బీహార్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడని, అతను కేవలం 'కిక్' కోసమే ఇలా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అయితే, ఈ హ్యాకింగ్‌ల వెనుక ఉన్న అసలు కారణాలు గేమింగ్ యాప్‌ల బాధితులుగా మారుతున్న యువత అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

నిర్మాతలకు తప్పని నష్టాలు

'ప్రతి సినిమాపై 18% జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అందిస్తున్నాం. అలాంటిది పైరసీ వలన ప్రభుత్వ ఖజానాకు కూడా పెద్ద మొత్తంలో గండి పడుతోంది అని దిల్ రాజు అన్నారు. సినిమాను పైరసీల బారి నుంచి కాపాడేందుకు కొత్త అప్‌డేట్‌లు తీసుకొస్తున్నప్పటికీ, హ్యాకర్లు దానికి మించి కొత్త మార్గాల్లో దొంగతనం చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ బెడదను అరికట్టేందుకు పోలీసులతో కలిసి కొత్త అప్‌డేట్‌ల కోసం చర్చలు జరుపుతున్నామని తెలిపారు..

ALSO READ : OG Collection: ఓజీ 4 డేస్ కలెక్షన్లు ప్రకటించిన మేకర్స్.. మొత్తం ఎన్ని కోట్లంటే?

 సినిమా తీసేవారిలో 95% మంది నష్టపోతుండగా కేవలం 5% మాత్రమే విజయం సాధిస్తున్నారని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కూడా ఈ పైరసీ తిప్పలు తప్పడం లేదు' అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక సినిమా థియేటర్‌లో విడుదలైన వెంటనే పైరసీ కాపీ ఇంటర్నెట్‌లో దర్శనమివ్వడం వల్ల నిర్మాతలకు, పంపిణీదారులకు తీవ్ర నష్టాలు వస్తున్నాయి. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతోందో, పైరసీ బెడద కూడా అంతే వేగంగా పెరుగుతోందని, దీనికి గట్టి కట్టడి అవసరమని దిల్ రాజు కోరారు.

 

హిట్, కుబేరా, హరిహరవీరమల్లు, పైరసీ పై దర్యాప్తు చేశారు పోలీసులు. తెలుగు సహా ఇతర భాషల సినిమాలను కూడా ఈ ముఠా పైరసీ చేసినట్లు హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.  దీని వల్ల సినిమా ఇండస్ట్రీకీ ఇప్పటి వరకూ 22 వేల 400 కోట్లు నష్టం వచ్చినట్లు గుర్తించారు. ఇందులో టాలీవుడ్ కు 3,700 కోట్ల నష్టం వాటిల్లింది. 18 నెలల్లో 40కి పైగా తెలుగు, హిందీ, తమిళ సినిమాలు విడుదల రోజునే లీక్ చేశారు. దుబాయ్, నెదర్లాండ్, మియన్మార్ లో సినిమా పైరసీ కేటుగాళ్ళు ఉన్నట్లు గుర్తించారు. థియేటర్లలో వచ్చే సినిమా శాటిలైట్ కంటెంట్ ఐడీ.. పాస్ వర్డ్ లను ట్రాక్ చేస్తున్నారు. అంతేగాకుండా ఏజెంట్ల ద్వారా షర్ట్ జేబుల్లో ,పాప్ కార్న్ , కోక్,టిన్ లలో కెమెరాలు పెట్టి సినిమాలు రికార్డ్ చేస్తున్నారు. ఈ కంటెంట్ ను ఇతర వెబ్ సైట్లకు అమ్ముతున్నారు. ఏజెంట్లకు  క్రిప్టోకరెన్సీ ద్వారా అకౌంట్లో కమీషన్లు ఇస్తున్నట్లు విచారణ తేలిందని సీవీ ఆనంద్ వెల్లడించారు. .