OG Collection: ఓజీ 4 డేస్ కలెక్షన్లు ప్రకటించిన మేకర్స్.. మొత్తం ఎన్ని కోట్లంటే?

OG Collection: ఓజీ 4 డేస్ కలెక్షన్లు ప్రకటించిన మేకర్స్.. మొత్తం ఎన్ని కోట్లంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’ కలెక్షన్ల మోత కొనసాగుతోంది. ఈ గ్యాంగ్ స్టార్ డ్రామా 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.252 కోట్లకి పైగా గ్రాస్ సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ ఇవాళ (సెప్టెంబర్ 29న) అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

‘‘తుఫాను వచ్చినప్పుడు.. ఆటుపోట్లకు తలవంచండి.. OG వచ్చినప్పుడు మాత్రం నువ్వు పరిగెత్తి దాక్కుంటావు!! 4 రోజుల్లో ఓజీ ప్రపంచవ్యాప్తంగా 252 కోట్ల+ గ్రాస్ సాధించి దూసుకెళ్తోంది’’ అని మేకర్స్ వసూళ్లను వెల్లడించారు.

గురువారం సెప్టెంబర్ 25న థియేటర్లోకి వచ్చిన ఓజీ.. నాలుగో రోజైన ఆదివారం (సెప్టెంబర్ 28న) సుమారు రూ.18.50 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియాలో నాలుగు రోజుల్లో రూ.140 కోట్ల నెట్ మార్కును అందుకుంది. పవన్ కల్యాణ్ కెరీర్లో రూ.250 కోట్లకి పైగా కలెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ఇదే. భీమ్లా నాయక్ లైఫ్ టైం (210కోట్లు) వసూళ్లను కేవలం రెండు రోజుల్లోనే ఓజీ అధిగమించింది.

Also Read :  ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మలయాళం మూవీ

అయితే, ఓజీ తొలిరోజు రూ.154 కోట్ల గ్రాస్ చేసినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేయగా, ఆ తర్వాత రెండ్రోజులు ప్రకటించలేదు. ఈ క్రమంలో ఎవ్వరికీ నచ్చిన నెంబర్, వాళ్లు వేసుకుంటూ.. వసూళ్లు ఇంత అని పోస్టర్స్ డిజైన్ చేసుకున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ఓ క్లారిటీ ఇస్తూ పోస్టర్ రిలీజ్ చేసి, అందర్నీ సైలెంట్ అయ్యేలా చేశారు. 

ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం:

ఓజీ సెప్టెంబర్ 24న ప్రీమియర్స్ ద్వారానే తెలుగులో రూ.21 కోట్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. డే 1 (గురువారం) సెప్టెంబర్ 25న రూ.63.75 కోట్ల నెట్, డే2 (శుక్రవారం) రూ.18.45 కోట్లు వచ్చాయి. అంటే దాదాపు 70.59 శాతం కలెక్షన్స్ తగ్గాయి.

అయితే, తెలుగులో మాత్రం కలెక్షన్లు పర్వాలేదనిపించింది. మూడో రోజైన శనివారం రూ.18.5 కోట్ల నెట్ రాబట్టింది. ఆదివారం సుమారు రూ.18.50 కోట్లు వసూలు చేసింది. ఇలా ఓజీ మూవీ నాలుగు రోజుల వసూళ్లను కలుపుకుని ఇండియాలో మొత్తంగా రూ.140 కోట్లకుపైగా నెట్ కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే.. ఓజీ మూవీ ఉత్తర అమెరికా, UK వంటి దేశాల్లోనూ దుమ్మురేపుతుంది. ఉత్తర అమెరికాలో 5 మిలియన్ డాలర్లకి పైగా (రూ.44 కోట్లు) సంపాదించింది. UK మూడు రోజుల్లో £309,574+ పైగా లెక్కలతో ఓజీ సంచలనం సృష్టించింది. ఇందులో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించి ఫ్యాన్స్కు మాస్ విందు వడ్డించారు.