Sarkeet OTT: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మలయాళం మూవీ.. ఆసిఫ్ అలీ గుర్తున్నాడుగా.. అతనిదే!!

Sarkeet OTT: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మలయాళం మూవీ.. ఆసిఫ్ అలీ గుర్తున్నాడుగా.. అతనిదే!!

మలయాళం ఇండస్ట్రీ ఈ ఏడాది ఓటీటీకి చాలా సినిమాలనే తీసుకొచ్చింది. క్రైమ్, థ్రిల్లర్స్, ఫ్యామిలీ డ్రామా, హారర్ వంటి వివిధ జోనర్లలలో మూవీస్ వచ్చి ఆకట్టుకున్నాయి. వాటిలో తుడరుమ్, ఎల్ 2 ఎంపురాన్, పొన్ మాన్, టూరిస్ట్ ఫ్యామిలీ, రేఖా చిత్రం, అలప్పుళ జింఖానా, బజూకా, డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్, నరివేట్ట వంటి మూవీస్ చాలానే ఉన్నాయి. ఇవి ముఖ్యంగా జియోహాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ఆహా లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీకి వచ్చి అలరిస్తుంది. మరి ఆ మూవీ ఏంటీ? ఎలాంటి జోనర్లో వచ్చింది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలపై లుక్కేద్దాం. 

సర్కీత్:

డైరెక్టర్ తమర్ కె.వి. తెరకెక్కించిన సైకలాజికల్ ఫ్యామిలీ థ్రిల్లర్ సర్కీత్. మలయాళ స్టార్ హీరో ఆసిఫ్ అలీ నటించిన ఈ మూవీ 2025 మే 8న థియేటర్లలో రిలీజై ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ కోసం ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తూ వచ్చారు.

దాదాపు 4 నెలల తర్వాత సర్కీత్ ఓటీటీకి ఎంట్రీ ఇచ్చింది. సెప్టెంబర్ 26 నుంచి మనోరమా మ్యాక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ప్రస్తుతం మళయాళంలోనే అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్ సబ్‌టైటిళ్లతో కూడాచూసేయొచ్చు! త్వరలో తెలుగులో స్ట్రీమ్ అవ్వనున్నట్లు టాక్.

UAEలో ఉంటూ ADHDతో బాధపడుతున్న తమ కొడుకును పోషించలేని ఓ మలయాళీ జంట చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఆసక్తిని కలిగించే స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ తమర్ మ్యాజిక్ చేశాడు. ఇందులో ఓర్హాన్, దీపక్ పరంబోల్, దివ్య ప్రభ, స్వాతి దాస్ ప్రభు, ప్రశాంత్ అలెగ్జాండర్ కీలక పాత్రల్లో నటించారు. 96' ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందించారు 

అయితే, ఆసిఫ్ అలీ నటించిన మలయాళ సినిమాలకు తెలుగులో మంచి ఫాల్లోవింగ్ ఉంది. ఇటీవలే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్గా వచ్చిన రేఖా చిత్రం, తలవన్, కిష్కింద కాండం వంటి మూవీస్ ఆకట్టుకున్నాయి. సో, ఆసిఫ్ అలీపై నమ్మకం ఉంచి సినిమాను ఒక్కసారి చూసేయొచ్చు!!!

సర్కీత్ కథేంటంటే:

బాలు (దీపక్ పరంబోల్), స్టెఫీ (దివ్య ప్రభ) తమ కొడుకు జెఫ్రాన్ (ఓర్హాన్)తో కలిసి యూఏఈలోని ఒక సిటీలో నివసిస్తుంటారు. జెఫ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అటెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిఫిసిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/హైపరాక్టివిటీ డిజార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఏడీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ)తో బాధపడుతుంటాడు. స్టెఫీ నర్సుగా, బాలు ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలో పనిచేస్తుంటారు. దాంతో ఏడేళ్ల పిల్లవాడిని ఇంట్లో ఒంటరిగా బంధించి రోజూ డ్యూటీకి వెళ్తుంటారు. అందువల్ల వృత్తిపరంగా, కుటుంబ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Also Read :  'OG' సినిమాకు 'ఫ్రెష్ కిక్'! నేటి నుంచి నేహా శెట్టి స్పెషల్ సాంగ్ అదనంగా!

మరోవైపు యూఏఈలోనే ఉంటున్న అమీర్ (ఆసిఫ్ అలీ) ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటాడు. కానీ.. ఎక్కడా జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాదు. దాంతో వీసా గడువు ముగిసేలోపు అంటే రెండు రోజుల్లో ఉద్యోగం వెతుక్కోవాల్సిన క్లిష్ట పరిస్థితిలో చిక్కుకుంటాడు. ఒకచోట కొంత డబ్బు డిపాజిట్ చేస్తే ఉద్యోగం ఇస్తామని చెప్తారు. డబ్బు సర్దుబాటు కాకపోవడంతో చివరకు అడ్డదారిలో సంపాదించాలి అనుకుంటాడు. ఈ రెండు కథల్లో చివరికి ఏం జరిగింది? ఈ రెండు కథలకు ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాలి.