ఎడపల్లి, వెలుగు: అదనపు కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపిన ప్రకారం.. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన శైలజకు ఎడపల్లి గ్రామానికి చెందిన వీర్ల సతీశ్‌తో వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం ఆమెను అత్తింటి వారు కొన్ని రోజులుగా వేధిస్తున్నారు. భర్త సతీశ్ దుబాయ్‌కు వెళ్లేందుకు రూ.లక్ష తేవాలని పట్టుబట్టడంతో గురువారం శైలజ అత్తగారి ఇంట్లో ఉరివేసుకుంది.
