గ్రేటర్‌సిటీలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంతా రంగుల్లో మునిగి తేలారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి డీజే పాటలకు స్టెప్పులేశారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ గల్లీ చూసినా హోలీ సెలబ్రేషన్సే కనిపించాయి. యువతీయువకులు రంగులు పూసుకుని, బైకులపై గల్లీల్లో తిరుగుతూ కేరింతలు కొట్టారు.
డిఫరెంట్ థీమ్స్‌తో సిటీలో వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఈవెంట్స్‌లో వేలాదిగా పాల్గొన్నారు. డీజేలు, ర్యాప్సింగర్లు ఉర్రూతలూగించే పాటలతో జోష్ నింపారు. ఓయూ క్యాంపస్‌లో స్టూడెంట్లంతా ఒక్కచోట చేరి హోలీ ఆడారు.
హైదరాబాద్/ఫొటోగ్రాఫర్స్ వెలుగు
