జూబ్లీహిల్స్ లోని ప్రభుత్వ కార్యాలయాలు,విద్యాసంస్థలకు నవంబర్ 11న సెలవు

జూబ్లీహిల్స్ లోని ప్రభుత్వ కార్యాలయాలు,విద్యాసంస్థలకు నవంబర్ 11న సెలవు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. పోలింగ్ రోజున జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు 
జారీ చేశారు.