విమెన్స్ డే సందర్భంగా మహిళా ఉద్యోగులకు సెలవు

విమెన్స్  డే సందర్భంగా మహిళా ఉద్యోగులకు సెలవు

హైదరాబాద్​, వెలుగు : మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8న మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. స్పెషల్​ క్యాజువల్​ లీవ్​ను ప్రకటిస్తూ సాధారణ పరిపాలన విభాగం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను కాదని కొందరు విభాగాల అధికారులు మహిళలకు సెలవు ఇవ్వడం లేదంటూ టీఎన్జీవో ప్రతినిధులు ఫిర్యాదు చేశారని, ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలకు 8న సెలవు ఇవ్వాల్సిందేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఉత్తర్వులను బేఖాతరు చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.