September 6 Holiday:హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనం.. సెప్టెంబర్ 6న సెలవు.. ప్రకటించిన ప్రభుత్వం

September 6 Holiday:హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనం.. సెప్టెంబర్ 6న సెలవు.. ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్: భాగ్య నగరంలో గణేశ్ నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 6న సెలవు ప్రకటించింది. సెప్టెంబర్ 6, 2025న హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూళ్లకు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో పాటు మరో కీలక ప్రకటన కూడా చేసింది. అక్టోబర్ 11న రెండో శనివారాన్ని వర్కింగ్ డేగా ప్రకటించింది. సెప్టెంబర్ 6న సెలవు ప్రకటించిన క్రమంలో అక్టోబర్ 11ను వర్కింగ్ డేగా ప్రకటించినట్లు ప్రభుత్వం ప్రకటనలో స్పష్టం చేసింది.

సెప్టెంబర్ 6న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంపై ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6న విశ్వశాంతి మహా గణపతిని నిమజ్జనం చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఉండడంతో ఒకరోజు ముందుగానే నిమజ్జనం   నిర్వహించనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 6న మహాగణపతి శోభాయాత్ర నిర్వహించి, అదే రోజు నిమజ్జనం పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనంతో హైదరాబాద్ సిటీలో దాదాపుగా గణేశ్ నిమజ్జనాలు పూర్తయినట్టే.

ఈసారి గణేశ్ ​శోభాయాత్ర జరిగే పాతబస్తీ మొదలుకుని మదీనా సెంటర్, అఫ్జల్​గంజ్, బేగంబజార్, మొజంజాహి మార్కెట్, అబిడ్స్, బషీర్​బాగ్, లిబర్టీ, ట్యాంక్​బండ్, ఎన్టీఆర్​మార్గ్, నెక్లెస్​రోడ్​తో పాటు ఖైరతాబాద్​బడా గణేశ్​ఊరేగింపు జరిగే ఖైరతాబాద్, లక్డీకాపూల్, టెలీఫోన్​భవన్, సెక్రటేరియెట్, ఎన్టీఆర్​మార్గ్​ప్రాంతాల్లో పోలీస్, బల్దియా, హెచ్ఎండీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్​ఆంక్షలతో పాటు వేలాదిగా తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల దాహార్తిని తీర్చడానికి వాటర్​క్యాంపులు, నిమజ్జనం చేసిన తర్వాత విగ్రహాల తొలగింపు కార్యక్రమాన్ని స్పీడప్​ చేయనున్నారు.