
‘పిజ్జా’ మొదలు ‘పేట’ వరకూ కార్తీక్ సుబ్బరాజ్ తీసింది ఐదు సినిమాలే అయినా దేనికదే వైవిధ్యం. విలక్షణ చిత్రాలతో రజనీకాంత్ స్థాయి స్టార్‌ని, ఆయన ఫ్యాన్స్‌ని మెప్పించగలిగిన ఈ యంగ్ డైరెక్టర్.. తన నెక్స్ట్ మూవీని ధనుష్‌తో తీస్తున్నాడు. మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. వైనాట్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. ఇది ధనుష్‌కి నలభయ్యవ చిత్రం. బుధవారం లండన్‌లో ప్రారంభ మైంది. కార్తీక్ గత చిత్రాల తరహాలోనే ఇదీ ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ తోనే వస్తోందనడంలో సందేహం లేదు.
అయితే ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ జేమ్స్ కాస్మో నటించనుండటం ఆసక్తి రేపుతోంది. బ్రేవ్ హార్ట్, ట్రాయ్, ద క్రానికల్స్ ఆఫ్ నార్నియా, వండర్ ఉమన్ లాంటి హాలీవుడ్ చిత్రాలతో పాటు ప్రముఖ టెలివిజన్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లోనూ జేమ్స్ కీలక పాత్రలను పోషించారు. ఆయనతో వర్క్ చేయనుండటం ఎక్సైటింగ్‌గా ఉందంటూ ఇటీవల కార్తీక్ సుబ్బరాజ్ ట్వీట్ చేశారు. ఈ సినిమా ఓపెనింగ్‌లోనూ జేమ్స్ కాస్మో పాల్గొన్నారు. మరి కోలీవుడ్ సినిమాలో ఈ హాలీవుడ్ యాక్టర్‌ని కార్తీక్ ఎలా చూపించబోతు న్నాడో. తనదైన స్క్రీన్ ప్లేతో ఎలా మెస్మరైజ్ చేయబోతున్నాడో!