
హాలీవుడ్ నటీనటులు సమ్మె బాట పట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి తమకు భరోసా కల్పించాలని, రెమ్యూనరేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ హాలీవుడ్ స్క్రీన్ యాక్టర్స్ సమ్మెకు దిగారు. ఇదే విషయంపై స్టూడియోలతో జరిగిన చర్చలు విఫలం కాకపోవడంతో.. స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో గిల్డ్‌లో ఉన్న లక్షా 60 వేల మంది నటీనటులు గురువారం నుండి సమ్మెలో పాల్గొంటున్నారు.
ఇక ఇవే డిమాండ్స్ తో గత 11 వారాలుగా రైటర్స్ గిల్డ్ కూడా సమ్మెకు దిగారు. ఇప్పుడు వారికి యాకర్స్ గిల్డ్ కూడా తోడవంతో హాలీవుడ్ ఇండస్ట్రీలో పనులన్నీ నిలిచిపోయాయి. 63 ఏండ్లలో ఇలా ఒకేసారి రచయితలు, నటులు సమ్మెకు దిగడం ఇదే తొలిసారి. గతంలో 1960లో యాక్టర్ రోనాల్డ్ రీగన్ అధ్యక్షతన రెండు యూనియన్లు స్ట్రైక్ చేశాయి. ఆ తరువాత ఇంతపెద్దయేత్తున సమ్మె జరగడం ఇదే తొలిసారి. అంతేకాదు ఇండస్ట్రీలో ఉన్న 98 శాతం మంది టెక్నీషియన్స్ ఈ సమ్మెకు మద్దతు పలకడం మరో విశేషం.
ఇక ఈ సమ్మెపై గిల్డ్ ప్రెసిడెంట్ ఫ్రాన్ డ్రెషర్ మాట్లాడుతూ.. ఇది హాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే సందర్భమని, కనీసం ఇప్పుడు కూడా తమ గళం విప్పకకపోతే కష్టాల్లో పడతామని అన్నారు ఫ్రాన్ డ్రెషర్.