హాలీవుడ్​ నటి సమంత మృతి

హాలీవుడ్​ నటి సమంత మృతి

 హాలీవుడ్​ నటి సమంత వైన్​స్టెయిన్​(28) మృతి చెందారు. రెండేళ్లుగా అండాశయ క్యాన్సర్​తో పోరాడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 14 మరణించారు. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా ఆమె తండ్రి పోస్ట్​ చేసిన ఫొటో వైరలైంది. పదేళ్లకే సినిమాల్లోకి వచ్చిన ఆమె 2005లో వచ్చిన ‘బిగ్​ గర్ల్​’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఇటీవల మైఖేల్​ నుట్సన్​ను పెళ్లి చేసుకోగా ఆరు నెలలకే ఆస్పత్రిలో చేరారు. రెండు వారాల క్రితమే ఆమె భర్తతో కలిసి వెకేషన్​కు వెళ్లారు. అదే ఆమెకు చివరిదైందంటూ ఫ్యాన్స్​ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.