
బాహుబలి, సలార్, కల్కి తదితర సినిమాలతో తెలుగు సినిమాలని ప్రపంచానికి పరిచయం చేశాడు ప్రభాస్. దీంతో వరల్డ్ వైడ్ ఒక్కసారిగా ప్రభాస్ మార్కెట్ తోపాటూ టాలీవుడ్ సినిమాలకి కూడా క్రేజ్ పెరిగింది. సినీ నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కంటెంట్ ని బట్టి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనుకాడటం లేదు.
అయితే ప్రభాస్ తో కన్నడ మరియు తెలుగులో కేజీయఫ్, కాంతార, సలార్ వంటి బిగ్ బడ్జెట్ చిత్రాలని నిర్మించిన హంబల్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్ 3 సినిమాలు చేస్తున్నట్లు అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు.
ఇందులో భాగంగా భారతీయ సినిమాని ప్రపంచానికి పరిచయం చెయ్యాలనే లక్ష్యంతో రెబల్ స్టార్ ప్రభాస్ తో భాగస్వామ్యం కావడం మాకు గర్వ కారణంగా ఉందని తెలిపారు. ఇందులోభాగంగా ఇప్పటికే అన్ని సిద్దంగా ఉన్నాయని ఈ క్రమంలో సలార్ 2 తమ ప్రయాణం ప్రారంభం అవుతుందని వెల్లడించారు.
Also Read:-గేమ్ ఛేంజర్ నుంచి కియారా పోస్టర్ రిలీజ్.
2026, 2027, 2028 సంవత్సరాలలో వరుస అప్డేట్ల కోసం వేచి ఉండండి అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కన్నడ ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ 2 ని తెరకెక్కిస్తున్నాడు. మిగిలిన రెండు చిత్రాల డైరెక్టర్లు ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
???? ?? ????? ??? ????? ?? ????!#PrabhasXHombal3Films
— Hombale Films (@hombalefilms) November 8, 2024
We are proud to unite with the Rebel Star, #Prabhas, in a groundbreaking three-film partnership that celebrates the essence of Indian cinema and aims to take it to the world. This is a declaration of… pic.twitter.com/E4osJGaMgR
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ మరియు హర్రర్ బ్యాక్ డ్రాప్ లో టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.