'కేజీఎఫ్ 3'పై హింట్ ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ

'కేజీఎఫ్ 3'పై హింట్ ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ

కన్నడ స్టార్ యష్ నటించిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' ఎంత హిట్అయ్యాయో అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండో భాగం రిలీజై రీసెంట్ గా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్  ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చింది. 'కేజీఎఫ్ 3' సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ను ఓ వీడియో ద్వారా తెలియజేసింది.  “అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి నిలబెట్టిన అత్యంత శక్తివంతమైన వాగ్దానం ఈ చిత్రం. ‘KGF2’ మరపురాని పాత్రలు, యాక్షన్‌తో మనల్ని ఓ అద్భుత ప్రయాణంలోకి తీసుకెళ్లింది. ప్రపంచ వ్యాప్త సినిమా రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సంవత్సర కాలంలో ఎన్నో సరికొత్త రికార్డులు సృష్టించింది” అంటూ ఓ భారీ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. వీడియో చివర్లో వాగ్దానం నిలబెట్టుకుంటున్నామంటూ 3 నెంబర్ ను షేక్ చేస్తూ వీడియోను ఎండ్ చేసింది.

ఈ వీడియోపై యశ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'కేజీఎఫ్ చాప్టర్ 3'పై హింట్ ఇచ్చారంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా రావు రమేష్, ప్రకాష్ రాజ్, రవీనా టాండన్, సంజయ్ దత్ లు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' సైతం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రాంతంతో తేడా లేకుండా విడుద‌లైన ప్రతి భాష‌లోనూ వ‌సూళ్ళ పరంపరను కొనసాగించింది. బాలీవుడ్‌లో ఈ చిత్రం స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది.

https://twitter.com/hombalefilms/status/1646732589540028416