
అల్వాల్ వెలుగు: పండుగకు సొంతూరెళ్లగా ఇంట్లో చోరీ జరిగిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అల్వాల్ సాయి నగర్ జేఎస్ రెసిడెన్సీలో సాఫ్ట్వేర్ఎంప్లాయ్ శ్రీకాంత్, విజయలక్ష్మి దంపతులు ఉంటున్నారు. పండుగ సెలవులు రావడంతో ఈనెల 8న సొంతూరు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు వెళ్లారు. గురువారం ఉదయం శ్రీకాంత్ రెడ్డి ఇంటి తాళం పగలగొట్టి ఉందని అపార్ట్‌మెంట్‌వాసులు ఫోన్ చేసి చెప్పారు. సాయి నగర్ లో ఉండే తన మామ వెంకటేశ్వర్ రెడ్డికి చెప్పగా వెళ్లి చూశాడు. ఇంట్లో బీరువా పగలగొట్టి ఉండి12 తులాల బంగారం, కొంత నగదు కూడా కనించలేదు. దీంతో పోలీసులకు కంప్లయింట్చేయగా కేసు ఫైల్ చేశారు.