
దేవర బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అదిరే హాట్ ఫొటోస్తో రచ్చ చేస్తుంటుంది. కానీ, ఈ సారి జాన్వీ తన సింపుల్ లుక్స్తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది.
లేటెస్ట్గా 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో (78th Cannes Film Festival) జాన్వీ కపూర్ తళుక్కుమని మెరిసింది. ఇది జాన్వీకి కేన్స్లో మొదటి ప్రదర్శన కావడం విశేషం. అందుకు తగ్గట్టుగానే ముత్యాలు బీడ్స్తో డిజైన్ చేసిన పొడవాటి లెహంగాను జాన్వీ ధరించింది. డిజైనర్ తరుణ్ తహిలియాని తయారు చేసిన లెహంగాలో, ఆమె తన అందాన్ని మరియు గ్లామర్‌ను చూపించింది. తాను తొలిసారి ఐకానిక్ రెడ్ కార్పెట్పై నడిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
Also Read : ఎన్టీఆర్, హృతిక్‍ను మించి డామినేషన్
ఈ ఫోటోలను జాన్వీ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. "78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హోమ్‌బౌండ్" అని ఆమె క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, గ్లామర్ని సాంప్రదాయ బద్ధంగా ఎలివేట్ చేసేలా నైపుణ్యత జాన్వీ ప్రదర్శిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే "ఆమె ఒక సొగసైన భారతీయ మత్స్యకన్యలా కనిపిస్తుంది.. చాలా సొగసైన మరియు క్లాసీ, అందాన్ని చూపించి ఫిదా చేసింది.. " అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొక నెటిజన్ స్పందిస్తూ.. "నా రాణి, నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది. మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాము. నువ్వు చాలా ప్రతిభావంతురాలివి మరియు చాలా అందంగా ఉన్నావు" అని కామెంట్ చేశాడు. ఇకపోతే.. ధడక్తో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కో స్టార్ ఇషాన్ ఖట్టర్ కూడా కేన్స్ 2025లో సందడి చేయడం విశేషం.
PICS- #JanhviKapoor at the #CannesFilmFestival2025 ❤️ pic.twitter.com/NXDAGwINQX
— Janhvi Kapoor Universe (@JanhviKUniverse) May 20, 2025
జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. బుచ్చిబాబు సానా డైరెక్షన్లో ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే దేవర 2 లో కూడా తంగం పాత్రలో జాన్వీ కంటిన్యూ అవుతుంది. ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ లో స్టార్ట్ అవ్వనున్నట్లు సమాచారం.