Kiara Advani Bikini: ఎన్టీఆర్, హృతిక్‍ను మించి డామినేషన్.. సోషల్ మీడియాను హోరెత్తిస్తున్న కియారా బికినీ లుక్‍

Kiara Advani Bikini: ఎన్టీఆర్, హృతిక్‍ను మించి డామినేషన్.. సోషల్ మీడియాను హోరెత్తిస్తున్న కియారా బికినీ లుక్‍

హీరోయిన్స్‌‌కు పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గుతాయనేది పాత మాట. బాలీవుడ్​ బ్యూటీ కియారా అద్వానీ లాంటి హీరోయిన్స్‌‌ పెళ్లి తర్వాత మరింత బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె వరుస అవకాశాలతో జోరుమీదుంది.

నిన్న (మే20న) రిలీజైన వార్ 2 టీజర్తో కియారా ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. ఓ వైపు తారక్, మరోవైపు హృతిక్ లాంటి స్టార్ హీరోస్ ఉన్న వార్ 2లో.. కియారా మాత్రమే టాక్ ఆఫ్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్గా మారింది.

అసలిప్పుడు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి రాడానికి ముఖ్య కారణం వార్ 2 టీజరే. అదేంటీ ? టీజర్ మొత్తం ఎన్టీఆర్, హృతిక్ల ఫైట్స్తో నిండిపోయింది కదా. కియారా కనిపించింది కొన్ని సెకన్లే కదా అని అనుకోవొచ్చు. కానీ, ఇక్కడే ఉంది మజా! వివరాల్లోకి వెళితే.. 

వార్ 2 టీజర్‌లో హృతిక్ రోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా నటించిన కియారా అద్వానీ బికినీలో కనిపించి మెస్మరైజ్ చేసింది. ఎల్లోష్ గ్రీన్  బికినీలో కియారా కనిపించి తళుక్కుమన్నది. ప్రస్తుతం ఈ బికినీ లుక్ సోషల్ మీడియాను హోరెత్తిచ్చేస్తోంది.

ఈ క్రమంలో బికినీ ఫొటోలు, వీడియోలు నెటిజన్లు తెగ షేర్ చేస్తు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో వైరల్ చేసేస్తున్నారు. ఎల్లోష్ గ్రీన్  బికినీలో అమ్మడు సూపర్ అని.. బికినీలో కియారా వేరే లెవెల్లో అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

YRFస్పై యూనివర్స్ మూవీస్ల్లో నటించే హీరోయిన్స్ ఎప్పటికప్పుడు తమ బికినీలతో హాట్ టాపిక్గా మారుతున్న విషయం తెలిసిందే. గతంలో వార్ 1లో వాణికపూర్ బికినీలో కనిపించి తన స్పెషల్ అపీయరెన్స్తో కుర్రాళ్లను ఫిదా చేసింది. ఇక రీసెంట్గా షారుక్ పఠాన్‌ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే సైతం బికినీ లుక్లో జిగేల్ అనిపించింది. ఇక ఇప్పుడు కియారా అంతకుమించి అనేలా కుర్రాళ్ల మతి పోగెట్టేస్తోంది.

ఇద్దరు స్టార్ హీరోలను కియారా పూర్తిగా డామినేట్ చేసేశారని.. ఇది తాము ఏ మాత్రం ఊహించలేదని, కియారా బికినీలో అదిరిపోయారని మరికొందరు సరదాగా కామెంట్లు చేసేస్తున్నారు. ఇకపోతే, వార్ 2 లో తన తొలి ప్రయత్నంలో కియారా ఈ బికినీ ధరించడం విశేషం. యాక్షన్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2 మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నాడు. యశ్ రాజ్  ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 14న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.