హైదరాబాద్లో కొత్త హోండా బైక్స్

హైదరాబాద్లో కొత్త హోండా బైక్స్

హైదరాబాద్​, వెలుగు: టూవీలర్​ మేకర్​హోండా హైదరాబాద్‌‌లో మార్కెట్లోకి తన రెండు బైక్స్​ సీబీ125 హార్నెట్, షైన్ 100 డీఎక్స్​ను  తీసుకొచ్చింది. వీటిని  కూకట్‌‌పల్లిలోని నెక్సస్ మాల్‌‌లో ఆవిష్కరించింది.  సీబీ125 హార్నెట్​లో  గోల్డెన్ యూఎస్‌‌డీ ఫ్రంట్ ఫోర్కులు, కీ- ఆన్- ట్యాంక్ ఇగ్నిషన్ సిస్టమ్, బ్లూటూత్  కనెక్టివిటీతో కూడిన 4.2-అంగుళాల టీఎఫ్‌‌టీ డిస్‌‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. 

షైన్ 100 డీఎక్స్ ఇంజిన్  కెపాసిటీ 98.98 సీసీ కాగా, 65 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. హార్నెట్​ధర రూ. 1,12,000 కాగా, షైన్​100 డీఎక్స్​ రూ. 75,950 (ఎక్స్​షోరూమ్) అని హోండా మోటార్స్​ తెలిపింది.