చారిత్రాత్మక సందర్భానికి గుర్తుగా పర్యటించడం గౌరవం : మోదీ

చారిత్రాత్మక సందర్భానికి గుర్తుగా పర్యటించడం గౌరవం : మోదీ

ఆస్ట్రియా చాన్స్ లర్ కార్ల్ నెహమ్మార్ కు ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ. అంతక ముందు భారత ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటన ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాల్లో కీలక మైలురాయని ట్వీట్ చేశారు ఛాన్స్ లర్ కార్ల్ నెహమ్మార్. భౌగోలిక రాజకీయ సవాళ్లు, ఇరు దేశాల మధ్య సహకారం వంటి అంశాల్లో కీలక చర్చలు జరుగుతాయన్నారు. 

దీనిపై  ట్విట్టర్ లో స్పందించిన మోదీ.. ఆస్ట్రియాలో చారిత్రాత్మక సందర్భానికి గుర్తుగా పర్యటించడం నిజంగా తనకు గౌరవమన్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలలో సన్నిహిత భాగస్వామ్యాన్ని నిర్మించడానికి ఈ పర్యటన పునాదిలాంటిదన్నారు ప్రధాని మోదీ.