హైదరాబాద్ మాదాపూర్లో పోకిరీల ఆగడాలు.. స్కూటీపై వెళ్తున్న యువతిని ఫాలో అవుతూ వేధింపులు..

హైదరాబాద్ మాదాపూర్లో పోకిరీల ఆగడాలు.. స్కూటీపై వెళ్తున్న యువతిని ఫాలో అవుతూ వేధింపులు..

హైదరాబాద్ లో పోకిరీల ఆగడాలు ఆగడం లేదు. ఇటీవల రోడ్డుపై అమ్మాయిలను ఫాలో అవుతూ వేధింపులకు గురి చేస్తున్న ఆకతాయిలకు బుద్ధి చెప్పారు పోలీసులు. మంగళవారం (ఆగస్టు 2) మళ్లీ అలాంటి బ్యాచ్ ఒకటి స్కూటీపై వెళ్తున్న యువతిని ఫాలో అవుతూ వేధించిన ఘటన కెమెరాకు చెక్కింది. 

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీపై వెళ్తున్న యువతులను ఫాలో అవుతూ నానా అల్లరి చేశారు పోకిరీలు. కామెంట్స్ చేస్తూ తాకే ప్రయత్నం చేశారు. దీంతో యువతులు బిక్కుబిక్కుమంటూ నడుపుకుంటూ వెళ్లే పరిస్థితి. 

వెనుక నుంచి కారులో వస్తున్న వారు పోకిరీల ఆగడాలను గమనించి వీడియో తీశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  అయితే వీడియో తీస్తుండగా ఏంటి వీడియో తీస్తున్నావ్ అన్నట్లుగా బెదిరించే ప్రయత్నం చేసి పారిపోయారు. పోలీసులకు ట్యాగ్ చేస్తూ వీడియో ఎక్స్ లో షేర్ చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు.