సిద్ధిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి బావిలో పడిన కారు.. నలుగురు మృతి

సిద్ధిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి బావిలో పడిన కారు.. నలుగురు మృతి

సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు బావిలో పడటంతో నలుగురు మృతి చెందారు. 2026 ఆగస్టు 20న తెల్లవారు జామున దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకును పోలీసులు కారును బావిలో నుంచి వెలికి తీశారు. చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు.  మృతులు బల్వంత పూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.  మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. 

మృతులు దుబ్బాక మండలం బలవంతపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.. వారి వివరాలు వెల్లడించారు. ధన్ల రాజు (35) అతని భార్య భాగ్య( 22), ఇద్దరు పిల్లలు కొడుకు నియాన్స్(5), కూతురు శాన్విక( 3) గా గుర్తించారు.