షాకింగ్ : పామును బెల్ట్ గా మార్చి.. వ్యక్తిని చితకబాదాడు

షాకింగ్ : పామును బెల్ట్ గా మార్చి.. వ్యక్తిని చితకబాదాడు

కెనడాలోని టొరంటో నగరంలో జరిగిన ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ స్ట్రీట్ ఫైట్‌లో, ఒక వ్యక్తి తన పెంపుడు పాము పైథాన్‌ను ఉపయోగించి మరొక వ్యక్తిపై దాడి చేశాడు. ఆ వ్యక్తి తన పెంపుడు పాము కొండచిలువతో అవతలి వ్యక్తిని కిరాతకంగా కొట్టిన ఘటన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితుడు తన పెంపుడు జంతువును బెల్టులా ఉపయోగించి అవతలి వ్యక్తిని కొట్టడం ఈ వీడియోలో చూడవచ్చు.

నిందితుడు పాము సాయంతో వ్యక్తిపై దాడి చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు కారు తన దగ్గరికి వచ్చి ఆగడంతో, అతను కొండచిలువను విడిచిపెట్టి, రోడ్డుపై పోలీసుల కాళ్లపై మోకరిల్లాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు.

https://twitter.com/crazyclipsonly/status/1657482303906480130