త్వరలో హాస్పిటల్స్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ : ఈటల

త్వరలో హాస్పిటల్స్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ : ఈటల

హుజూరాబాద్ : తెలంగాణలో ఆరోగ్య శాఖను దేశానికే రోల్ మోడల్ గా తీర్చి దిద్దుతామన్నారు మంత్రి ఈటల రాజేందర్. సోమవారం హుజూరాబాద్ లో హస్పిటల్స్ పై రివ్యూ సందర్భంగా మాట్లాడిన ఈటల..  రోలం మోడలం కోసం తన నియోజక వర్గమైన హుజూరాబాద్ నుంచే చర్యలు మొదలు పెడుతున్నట్లు చెప్పారు. మూడు నెలలుగా వైద్య ఆరోగ్యశాఖపై పూర్తి అవగాహన కోసం పలు సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పేదవారికి మెరుగైన  ప్రభుత్వ వైద్యం అందించేందుకు సీఎం సూచనల మేరకు కీలక మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు చెప్పారు.

గ్రాండ్ లెవెల్లో ఉన్న సమస్యలను తెలుసుకొనేందుకు నేడు హుజురాబాద్ నియోజకవర్గంలోని  ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను స్వయంగా పరిశీలించానన్నారు. ఇదే తరహాలో రాష్ట్రమంతా పర్యటిస్తానన్న ఆయన..PHC స్థాయిలో  ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను రేషనైజేషన్ చేసుకుంటామన్నారు. PHC ల సంఖ్య తగ్గించబోమని చెప్పిన ఈటల.. రోగుల సంఖ్యనుబట్టి అవసరం ఉన్న చోటికి తరలిస్తామన్నారు.

Read Also:స్కూళ్లను విలీనం చేసి నాశనం చేస్తున్నారు

కొంతకాలంగా కుటుంబం వారీగా వ్యాధులు, అవసరమైన మందుల చిట్టా తయారు చేశామని..కుటుంబం యూనిట్ గా ఆరోగ్య సమస్యలపై నివేదిక తయారు చేస్తున్నామన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద ఉన్న ఆస్పత్రులన్నింటిలో  స్టాఫ్ ను రిక్రూట్ చేసుకుంటామని తెలిపారు. మరో 7 కొత్త మెడికల్ కాలేజీల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశామని చెప్పిన ఆయన.. రాష్ట్రంలో వైద్యాన్ని ప్రజల ముంగిటికి తీసుకు వస్తామన్నారు. జబ్బులు వచ్చిన తరువాత లక్షల్లో ఖర్చు పెట్టడం కంటే.. ముందుగానే గుర్తించి చికిత్స అందించేందుకు వైద్య సదుపాయాలను మెరుగు పరుస్తున్నామని చెప్పారు.

పేదవారికి జబ్బుచేస్తే ప్రభుత్వం ఉందనే భరోసా కల్పిస్తున్నామని..దేశంలో అతి ఎక్కువ మంది డాక్టర్స్ ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 700 పైచిలుకు మెడికల్ పీజీ సీట్లు పెరిగాయని.. వీరందరూ కోర్సులు పూర్తి చేసుకుని వస్తే హాస్పిటల్స్ లో డాక్టర్స్ కొరత ఉండదన్నారు. 33 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉన్నాయని ..రూ. 550 కోట్లతో 9 జిల్లా కేంద్రాల్లో ఉన్న హాస్పిటల్స్ ను అప్ గ్రేడ్ చేయబోతున్నామన్నారు.

కరీంనగర్ జిల్లా ఆస్పత్రిని 1000 పడకల ఆసుపత్రిగా  తీర్చిదిద్దబోతున్నామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ను మెడికల్ హబ్ గా తయారు చేయడంలో భాగంగా అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హుజూరాబాద్ సహా అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో అన్ని వసతులు సిబ్బందితో కూడిన ఆస్పత్రులు ఉండేలా చూస్తామని తెలిపారు మంత్రి ఈటల.

Read More:గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు