
హైదరాబాద్ సిటీ, వెలుగు: చింతల్ బస్తీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ హరి చందన విజిట్చేశారు. వర్షాలు పడుతున్నందున దవాఖానాలకు ఎక్కువ మంది రోగులు వచ్చే అవకాశం ఉందని, అలర్ట్గా ఉండాలన్నారు. పీహెచ్ సీల్లో మందులు కొరత లేకుండా చూడాలన్నారు. చిన్నపిల్లలకు వంద శాతం ఇమ్యునైజేషన్ అందాలని సూచించారు. ఏఎన్ఎంలతో ఇంటింటి ఫీవర్ సర్వే పక్కాగా చేయించాలన్నారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన రోగులతో మాట్లాడారు. వార్డులు, ఓపీ విభాగం, యునాని విభాగాన్ని పరిశీలించారు. డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ హేమలత, డాక్టర్ రుక్సానా పర్వీన్ పాల్గొన్నారు.
ఆయుష్ డాక్టర్లు అల్లోపతి వైద్యం చేస్తున్నరు
జిల్లాలో పర్మిషన్లేని హాస్పిటల్స్పై యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ హరిచందన ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి రిజిస్టరింగ్ అథారిటీ కమిటీ సమావేశంలో అడిషనల్కలెక్టర్ కదిరవన్ పలని, డీసీపీ డాక్టర్ లావణ్య తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జాయింట్ ఆపరేషన్స్చేసి పోలీస్ అధికారులతో ఎస్పీహెచ్వోలు పర్మిషన్లు లేని దవాఖానలపై కేసులు నమోదు చేయాలన్నారు. ఆయుష్డాక్టర్లు అల్లోపతి ట్రీట్మెంట్ చేస్తున్నారని, తనిఖీలు చేయాలని ఆదేశించారు.