బ్రెజిల్లో విషాదం..హాట్ ఎయిర్ బెలూన్ కూలిపోయి.. గాల్లోనే 8మంది టూరిస్టులు మృతి

 బ్రెజిల్లో విషాదం..హాట్ ఎయిర్ బెలూన్ కూలిపోయి.. గాల్లోనే 8మంది టూరిస్టులు మృతి

బ్రెజిలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం (జూన్ 21) హాట్ ఎయిర్ బెలూన్ కూలిపోయి ఎనిమింది మృతిచెందారు. ప్రమాదం సమయంలో హాట్ ఎయిర్ బెలూన్ లో మొత్తం 22 మంది పర్యాటకులున్నారు.  బ్రెజిల్ లోని దక్షిణ రాష్ట్రమైన శాంటా కాటరినాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

శనివారం తెల్లవారుజామున టూరిజం హాట్ ఎయిర్ బెలూన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రియాగ్రాండే నగరంలో కూలిపోయిందని స్థానిక అగ్నిమాపక శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో 13మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిని సమీప ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.