రాజగోపాల్ రెడ్డి వర్సెస్ హరీశ్ : సీఎం సీటుపై చురకలు

రాజగోపాల్ రెడ్డి వర్సెస్ హరీశ్ : సీఎం సీటుపై చురకలు

తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య జరిగిన సంభాషణ ఇది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరుగుతున్న సమయంలో.. తన మాటలకు అడ్డు వస్తున్న రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి.. హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. ఎవరు ఏమన్నారో ఓసారి చూద్దాం...

హరీశ్ రావు : నువ్వు ఎంత మొత్తుకున్నా.. నీకు మంత్రి పదవి రాదు.. లేచి నిలబడితే మంత్రి ఇవ్వరు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు హరీశ్ రావు...

దీనిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు.. హరీశ్ రావుకు మేనమామ సాలు వచ్చింది.. మాటలు చెప్పటంలో.. అబద్దాలు చెప్పటంలో.. కేసీఆర్ బాగా ట్రైనింగ్ ఇచ్చారు. హరీశ్ రావు.. నువ్వు ఎంత కష్టపడినా.. తండ్రి కొడుకులు వాడుకుంటారు.. నువ్వు మంత్రి కాలేవు.. సీఎం అయ్యేది కేసీఆర్.. వాడుకున్నోడికి వాడుకున్నంత అన్నట్లు నిన్ను కేసీఆర్, కేటీఆర్ వాడుకుంటారు అంటూ హరీశ్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి...