
ఎక్కడైనా బావిలో చల్లని నీళ్లు రావడం చూశాం. కానీ మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని బావి నుంచి వేడినీళ్లు వస్తున్నాయి. తోడినా కొద్దీ వేడి నీళ్లు వస్తూనే ఉన్నాయి. వింతగా ఉన్న ఈ బావిని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అహేరి తాలుకాలోని తాటిగూడా గ్రామంలోని సత్తయ్య ఇంట్లోని బావి నుంచి వేడినీళ్లు సేగలు కక్కుతోంది. గత ఆరునెలలుగా బావిలో నుంచి వేడినీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. బావి నుంచి నీళ్లు తోడినా కొద్దీ వస్తూనే ఉన్నాయి. మంచినీటి బావిలో వేడి నీళ్లు రావడమేంటో అర్థం కావడం లేదు. వేడి నీళ్లలో చలినీళ్లు కలుపుకుని వాడుతున్నారు ప్రజలు. వేడినీళ్లు వస్తోన్న బావిని చూడటానికి భారీగా తరలివస్తున్నారు జనం. భూ భాగంలో ఖనిజాలు వేడెక్కడంతో నీళ్లు వేడవుతాయంటున్నారు భౌగోళిక నిపుణులు.
►ALSO READ | ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ లేదు.. కేవలం ఆ పాలసీపైనే 18 శాతం జీఎస్టీ.. కోటక్ లైఫ్ క్లారిటీ..