
Kotak Life: ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జీఎస్టీ సంస్కరణలు ప్రకటించబడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై కొనసాగుతున్న 18 శాతం జీఎస్టీని కొంత తగ్గించాలని ఇన్సూరెన్స్ కంపెనీలు కోరగా.. కేంద్రం వ్యూహాత్మకంగా సున్నా శాతానికి దానిని తగ్గించేసింది. ఇది దేశ ప్రజలకు ఇన్సూరెన్స్ చేరువ చేయటానికా లేక వారిపై భారాన్ని పెంచటానికా అన్న చందంగా మారింది జీఎస్టీ ఎత్తివేతతో.
ప్రభుత్వం తీసుకున్న కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్ల అమలు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో ఆ రోజు నుంచి పాలసీదారులు చెల్లించే అన్ని ప్రీమియం పేమెంట్స్ పై ఎలాంటి జీఎస్టీ వర్తించదని కోటక్ లైఫ్ తన అధికారిక వెబ్ సైట్ లో క్లారిఫై చేసింది. కొత్త జీఎస్టీ స్లాబ్ కింద హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, యులిప్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీదారులు ఎలాంటి జీఎస్టీ చెల్లించనక్కర్లేదని కోటక్ లైఫ్ చెప్పింది. అయితే కంపెనీలు తమ ఉద్యోగులకు అందించే గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మాత్రం 18 శాతం జీఎస్టీ కిందే ఉంటాయని వెల్లడించింది.
పాలసీదారులు కొత్త ఇన్సూరెన్స్ బయర్లపై ఎఫెక్ట్..
* జీఎస్టీని కేంద్రం ఎత్తివేయటంతో పాలసీదారులు ఆ మేరకు చెల్లించే భారం తగ్గింపు పొందుతారు. దేశంలో పెరుగుతున్న ఆరోగ్య ద్రవ్యోల్బణంలో పాలసీదారులకు చిన్న ఊరటగా జీఎస్టీ తొలగింపు ఉండనుంది.
* 18 శాతం జీఎస్టీ తగ్గింపుతో మెుత్తం 18 శాతం బెనిఫిట్స్ వస్తాయనుకోవటం సరికాదు. ఇకపై కంపెనీలు తమ ఖర్చులపై జీఎస్టీ ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ తిరిగి క్లెయిమ్ చేసుకోవటం కుదరదు కాబట్టి అందులో కొంత భారాన్ని పాలసీదారులపై వేస్తాయి కంపెనీలు. అంటే దీంతో.. పాలసీల బేస్ ప్రీమియం రేట్లు గతంలో కంటే 3 నుంచి 4 శాతం పెరుగుతాయి.
* పాలసీ బేస్ ప్రీమియం గరిష్ఠంగా 4 శాతం పెరిగినప్పటికీ అది జీఎస్టీ 18 శాతంతో పోల్చితే చాలా తక్కువ. అందువల్ల సెప్టెంబర్ 22 తర్వాత సామాన్య హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులు చెల్లించే ప్రీమియం గతంలో కంటే తక్కువగానే ఉండనుంది. వాస్తవానికి ఇది చాలా మందికి ఇన్సూరెన్స్ ఉత్పత్తులను చేరువ చేయనుంది. ప్రజల దృష్టిలో నుంచి ఇది పూర్తిగా ప్రయోజనకరమైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. చాలా మంది తమ లైఫ్ సేవింగ్స్ కాపాడుకునేందుకు ఇన్సూరెన్స్ తీసుకుని పెరుగుతున్న మెడికల్ ఖర్చుల నుంచి తప్పించుకోవటానికి వీలు కలగనుంది.
మెుత్తానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం లక్షల మంది పాలసీదారులకు ఆర్థిక ప్రయోజనంతో పాటు కొత్తగా పాలసీలు కొనాలనుకునేవారికి తక్కువ ఖర్చుతో భరోసాకు దారితీస్తుంది.