ఈ దరిద్రమైన కక్కుర్తి ఏంట్రా బాబూ : హోటల్ గదిలోని ఫ్యాన్లు, లైట్లు, దుప్పట్లో ఎత్తుకెళ్లారు

ఈ దరిద్రమైన కక్కుర్తి ఏంట్రా బాబూ : హోటల్ గదిలోని ఫ్యాన్లు, లైట్లు, దుప్పట్లో ఎత్తుకెళ్లారు

దొంగలెవరైనా బంగారం ఎత్తుకెళ్తారు ,డబ్బులు ఎత్తుకెళ్తారు.  కానీ ఈ వెరైటీ దొంగలు వింతగా హోటల్ లోని ఫ్యాన్లు, లైట్లు ఎత్తుకెళ్లారు. హోటల్ లో నైట్ స్టే చేసిన తర్వాత అందులోని వస్తువులతో ఉడాయించారు ఇద్దరు వ్యక్తులు. వినడానికి వింతగా ఉన్నా..ఇది నిజం.  హోటల్ గదిలోని ఫ్యాన్లు, లైట్లు, దుప్పట్లో వేసుకుని ఎత్తుకెళ్లారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

యునైటెడ్ కింగ్ డమ్ లోని పెంబ్రోక్ డాక్‌లోని డాల్ఫిన్ హోటల్ లో Booking.com  ద్వారా  ఓ జంట నైట్ స్టే  చేయడానికి వచ్చింది.   హోటల్ లో  స్టే చేయడానికి వచ్చినప్పుడు ఖాలీ చేతులతో వచ్చిన ఆ ఇద్దరు  మరుసటి రోజు భారీ  లగేజీతో  వెళ్లారు.  సిబ్బంది గదిలోకి వెళ్లే సరికి  వాళ్లు ఎత్తుకెళ్లిన వస్తువులేంటో చూసి షాకయ్యారు.  

ఇంతకీ వాళ్లు ఏం ఎత్తుకెళ్లారంటే.  గదిలోని  రెండు తెల్లటి బాత్ టవల్స్, రెండు హ్యాండ్ టవల్స్, ఒక ఎలక్ట్రిక్ ఫ్యాన్, రెండు ల్యాంప్స్, కెటిల్, టీ కేడీ ,  యూఎస్‌బీ పోర్ట్‌లతో కూడిన టవర్ ఎక్స్‌టెన్షన్ బ్లాక్‌లు దుప్పట్లో వేసుకుని  తీసుకెళ్లారు.  ఈ ఘటనపై  హోటల్ యజమాని నటాలీ న్యూటన్  పోలీసులకు  కంప్లైంట్ ఇచ్చారు. వారు  కేవలం సబ్బు, షాంపులను మాత్రమే వదిలేశారని చెప్పారు.  ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని డీఫెడ్-పోవైస్ పోలీసులు తెలిపారు.

నటాలీ, తన భర్త  చెఫ్ బెన్ రాండాల్‌తో కలిసి 2019లో హోటల్‌ను స్థాపించారు.  ఆమె కుటుంబం 1999 నుండి రెండు దశాబ్దాలుగా దీనిని పబ్‌గా నిర్వహిస్తున్నారు. ఈ అనుకోని ఘటనతో  వెస్ట్ వేల్స్ లోని తోటి హెటల్ యజమానులు జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు.