హిమాచల్​లో కుండపోత..ఇండ్లు నేలమట్టం

హిమాచల్​లో కుండపోత..ఇండ్లు నేలమట్టం
  • ఇల్లు కూలి ఒకే ఫ్యామిలీలో ఇద్దరు మృతి.. ముగ్గురు గల్లంతు

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సిర్​మౌర్ జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మలగి దడియాత్ గ్రామంలో ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఓ ఇల్లు కూలిపోయింది. గురువారం ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు.. ఇంటి శిథిలాల కింద నుంచి ఇద్దరి డెడ్ బాడీలను వెలికితీశాయి. మిగతా ముగ్గురి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. భారీ వర్షాలకు గిరి నది ఉప్పొంగడంతో మలగి దడియాత్ గ్రామంలోకి భారీగా నీరు చేరిందని అధికారులు గురువారం వెల్లడించారు. 

వేగంగా వచ్చిన వరదతో గ్రామంలోని ఒక ఇల్లు పూర్తిగా కూలిపోయిందని తెలిపారు. ఆ ఇంటి శిథిలాల కింద ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ చిక్కుకుపోయారని చెప్పారు. అందులో కుల్దీప్ సింగ్(60), నితీశ్ (10) డెడ్ బాడీలను రెస్క్యూ బృందాలు వెలికి తీశాయని వివరించారు. కుటుంబంలోని మిగతా ముగ్గురు.. కుల్దీప్ సింగ్ భార్య జీతో దేవి, కూతుర్లు రజనీ దేవి, దీపిక అచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని వెల్లడించారు.   కాగా.. రాష్ట్రంలో ఈ సీజన్ లో కురిసిన వర్షాలకు మరణించిన వారి సంఖ్య 231కి చేరింది. రూ.6,731 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దాదాపు 190 రోడ్లు దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం సుఖ్విందర్ సింగ్.. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.