మా ఇంటికి రావొద్దు...మీ ఇంటికి రానివ్వొద్దు

V6 Velugu Posted on Apr 19, 2021

హైదరాబాద్: ‘మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్.. మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావ్’.. అనే రోజులు పోయినయ్.. ఇప్పుడు కరోనా పుణ్యమాని ‘దయచేసి మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి’అంటున్నారు సిటీ జనం. సెకండ్​ వేవ్​తో గ్రేటర్ హైదరాబాద్​లో కేసులు పెరుగుతుండటంతో  కొందరు సెల్ఫ్ ​లాక్​డౌన్ ​పెట్టుకుంటున్నారు. మల్కాజ్​గిరిలోని ఓ మహిళ ఇలా ఇంటి గేటుకి బ్యానర్ ​ఏర్పాటు చేసుకుంది. దీన్ని చూసిన ఆ కాలనీ వాసులు సైతం వారి ఇండ్లకు బ్యానర్లను పెట్టుకున్నారు. ఇది సోషల్​మీడియాలో వైరల్​గా మారటంతో  సిటీలో చాలా మంది తమ ఇండ్ల గేట్లకు ఇలాంటి బ్యానర్లే కనిపిస్తున్నాయి.

Tagged Hyderabad, ghmc, corona effect, greater, house owners, , awareness with flexies, variety campaign

Latest Videos

Subscribe Now

More News