స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి నేడో రేపో నోటిఫికేషన్

స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి నేడో రేపో నోటిఫికేషన్


హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ అపార్ట్​మెంట్లలో ఫ్లాట్ల అమ్మకానికి హౌసింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ ను ఒకట్రెండు రోజుల్లో ఇవ్వనున్నారు. బ్లాక్​ల వారీగా అమ్మకానికి స్వగృహ అపార్ట్​మెంట్లు వేలం వేయగా బిల్డర్లు ముందుకు రాలేదు. దీంతో ఓపెన్ యాక్సెస్ ఫ్లాట్లను అమ్మేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత.. కొనాలనుకునేవాళ్లు బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్లను విజిట్ చేసి, అక్కడే ఏర్పాటు చేసిన స్టాల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హౌసింగ్ డిపార్ట్​మెంట్ అధికారులు తెలిపారు. ట్రిపుల్, డబుల్, సింగిల్ బెడ్ రూమ్ ఇలా అన్ని కేటగిరీల్లో మొత్తం 2,971 ఫ్లాట్లు అమ్మకానికి ఉంచారు. వీటి ద్వారా రూ.800 కోట్లు  ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి 30 రోజుల్లోగా అప్లై చేసుకోవాలని, ఆపై ఆన్ లైన్ లాటరీ ద్వారా ఫ్లాట్ దక్కించుకున్నవాళ్ల వివరాలను వెల్లడిస్తామని అధికారులు చెప్తున్నారు.