హౌసింగ్ కార్పొరేషన్ లో ఒకే రోజు 10 మంది పదవీ విరమణ : కార్పొరేషన్ ఎండీ

హౌసింగ్ కార్పొరేషన్ లో ఒకే రోజు 10 మంది పదవీ విరమణ : కార్పొరేషన్ ఎండీ
  • అంతమంది రిటైర్ మెంట్లు ఇబ్బందికరమే: కార్పొరేషన్ ఎండీ 

హైదరాబాద్, వెలుగు: హౌసింగ్  కార్పొరేషన్ లో శనివారం ఒక్క రోజే 10 మంది అధికారులు రిటైర్  అయ్యారు. ఇందులో ఒక సూపరింటెండెంట్  ఇంజినీర్ (ఎస్ఈ),  ముగ్గురు ఈఈలు ఉన్నారు. పదవీ విరమణ పొందిన అధికారులను హైదరాబాద్  హిమాయత్ నగర్ లోని కార్పొరేషన్  హెడ్డాఫీసులో ఎండీ వీపీ గౌతమ్  ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్  అమలవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒకేసారి ఇంత మంది రిటైర్  కావడం కార్పొరేషన్ కు ఇబ్బందేనని అన్నారు. రిటైర్  అయిన అధికారుల నుంచి గత ఏడాదిలో తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు, డబుల్  బెడ్ రూమ్  స్కీమ్ లలో ఏళ్ల పాటు పనిచేశారని పేర్కొన్నారు.