Josh Hazlewood: ఐపీఎల్ (IPL 2026) రేపు (2026, మే 31న) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్‌సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ ఫైట్ జరగనుంది. గుజరాత్ హోమ్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలుస్తుందా అని బెంగళూరు ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నా.. డోంట్ వర్రీ బాస్! చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క ఫైనల్ కూడా ఓడిపోని ఆర్‌సీబీ లక్కీ చార్మ్ జోష్ హేజిల్‌వుడ్ మాస్ సెంటిమెంట్ చూస్తే గుజరాత్ అభిమానులకి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.
ఫైనల్స్ లో హేజిల్‌వుడ్ రికార్డులు:
వైట్ బాల్ క్రికెట్ ఫైనల్స్ లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.. మీరు విన్నది నిజమే అయ్యా.. జోష్ హేజిల్‌వుడ్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఆడిన ఏ వైట్-బాల్ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఓటమి అనేదే ఎరుగడు.. ఇదొక రేర్ అండ్ మైండ్ బ్లోయింగ్ రికార్డ్ అని చెప్పాలి.. ఇప్పటి వరకు అతను 5 టీ20 ఫైనల్స్ ఆడితే.. ఐదింట్లోనూ అతడు ఉన్న జట్లే ట్రోఫీలు గెలిచాయి.
* 2012 ఛాంపియన్స్ లీగ్ T20: సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతూ హైవెల్డ్ లయన్స్‌ను ఓడించి ఫస్ట్ టీ20 టైటిల్ ముద్దాడాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లతో జోష్ నింపాడు.
* 2019– 20 బిగ్ బాష్ లీగ్ (BBL): మళ్లీ సిడ్నీ సిక్సర్స్ టీమ్‌తోనే మెల్‌బోర్న్ స్టార్స్‌ను దంచికొట్టి కెరీర్‌లో రెండో టీ20 ట్రోఫీని గెలుచుకున్నాడు.
* 2021 ఐపీఎల్ (IPL): ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్‌లో భాగమై.. మెన్ ఇన్ ఎల్లోకు 4వ ఐపీఎల్ టైటిల్ అందించడంలో కీ రోల్ ప్లే చేశాడు.
* 2021 టీ20 వరల్డ్ కప్: ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున ఫైనల్లో 3 వికెట్లతో కిర్రాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి కంగారూలకు ఫస్ట్ టీ20 వరల్డ్ కప్ అందించాడు.
* 2025 ఐపీఎల్ (IPL ): గత ఏడాది ఆర్‌సీబీ తరఫున ఫైనల్ ఆడి, బెంగళూరు ఫ్యాన్స్ 18 ఏండ్ల కలను నిజం చేస్తూ మొదటి ఐపీఎల్ ట్రోఫీని అందించాడు.
* ఇంటర్నేషనల్ వన్డేలలో కూడా హేజిల్‌వుడ్ ఆడిన 2015, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ లోనూ ఆస్ట్రేలియానే గెలిచింది. అంటే ఇతను స్టేడియంలోకి దిగాడంటే చాలు.. ఆపోజిట్ టీమ్‌కు ప్యాకప్ ఖాయం అనే రేంజ్‌లో నడుస్తుంది లక్.
►ALSO READ | బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన జట్లు ఇవే.. ధోని, రోహిత్ క్లబ్‌లో ఆర్‌సీబీ చేరేనా?
ఫైనల్స్ లో హేజిల్‌వుడ్ రికార్డులు:
బిగ్ మ్యాచ్‌లలో ప్రెజర్ కి గురి కాకుండా వికెట్లు తీయడం జోష్ హేజిల్‌వుడ్ స్టైల్.. అతని ఓవరాల్ టీ20 ఫైనల్స్ రికార్డ్స్ ఒకసారి పరిశీలిస్తే..
* మొత్తం మ్యాచ్‌లు 5
* తీసిన వికెట్లు10
* బౌలింగ్ సగటు (Average)13.9
* ఎకానమీ రేట్ (Economy)7.31
ఇందులో అతని బెస్ట్ పర్ఫార్మెన్స్ 2012 CLT20, 2021 టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో వచ్చింది. ఇక వర్స్ట్ పర్ఫార్మెన్స్ అంటే గత ఏడాది (2025) ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై 4 ఓవర్లలో 54 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కానీ, అక్కడ కూడా అతని బ్యాడ్ డే రోజు కూడా లక్ కలిసివచ్చి ఆర్‌సీబీనే కప్ గెలిచింది.
రేపు మ్యాజిక్ పక్కా:
గత సీజన్ (2025) లో హేజిల్‌వుడ్ ఆర్‌సీబీ తరఫున కేవలం 12 ఇన్నింగ్స్‌లలోనే ఏకంగా 22 వికెట్లు పడగొట్టి అరాచకం సృష్టించాడు. అందుకే ఫ్యాన్స్ అతన్ని ముద్దుగా ‘HazleGod’ అని పిలుస్తుంటారు. కానీ ఈ ఐపీఎల్ 2026 సీజన్ లో అతని ఫామ్ కొంచెం డల్ అయింది. ఈ సీజన్ లో 12 ఇన్నింగ్స్‌లలో 13 వికెట్లు తీశాడు. రన్స్ కూడా కొంచెం ఎక్కువే ఇచ్చాడు. హేజిల్‌వుడ్ బిగ్ మ్యాచ్ ప్లేయర్ కావడం.. రేపు( 2026, మే 31) గుజరాత్ టైటాన్స్ పై తన పాత ఫామ్‌ను బయటకు తీసి అన్-బీటెన్ ఫైనల్స్ స్ట్రీక్‌ను కంటిన్యూ చేస్తాడని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ నమ్మకం పెట్టుకుంది.
