బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన జట్లు ఇవే.. ధోని, రోహిత్ క్లబ్‌లో ఆర్‌సీబీ చేరేనా?

బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన జట్లు ఇవే.. ధోని, రోహిత్ క్లబ్‌లో ఆర్‌సీబీ చేరేనా?

IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఆఖరి అంకానికి వచ్చేసింది భయ్యా. రెండు నెలల సంబురానికి రేపటితో ఎండ్ కార్డు పడబోతుంది. మే 31 (ఆదివారం) నాడు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో రజత్ పాటిదార్ నాయకత్వంలోని ఆర్‌సీబీ, శుభ్‌మన్ గిల్ సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ ట్రోఫీ కోసం గట్టిగ కుస్తీ పడబోతున్నాయి. క్వాలిఫయర్-1లో గుజరాత్‌ని ఘోరంగా ఓడించి ఫైనల్ కి బెంగళూరు చేరింది. ఒకవేళ రేపు గనుక మ్యాచ్ గెలిస్తే ఆర్‌సీబీ పోరగాళ్లు హిస్టరీ క్రియేట్ చేస్తారు. వరుసగా రెండో ఏడాది కప్పు కొట్టి, ఐపీఎల్ చరిత్రలోనే ఒక కిర్రాక్ రికార్డును పైసా వసూల్ రేంజ్ లో సొంతం చేసుకునే గోల్డెన్ ఛాన్స్ పాటిదార్ సేన ముందుంది. 

ధోని, రోహిత్ ఎలైట్ క్లబ్లో పాటిదార్ చేరేనా?: 
ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు సార్లు కప్ కొట్టి టైటిల్‌ను డిఫెండ్ చేసుకున్న రికార్డు కేవలం రెండు జట్లకు మాత్రమే ఉంది. ఒకవేళ ఆర్‌సీబీ గనుక రేపు గెలిస్తే, రజత్ పాటిదార్ నేరుగా మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మల పక్కన కుర్చీ వేసుకుని కూర్చునే అవకాశం దక్కుతుంది.  

18 ఏండ్ల కల నెరవేరింది:  
2025లో 18 ఏండ్ల శాపాన్ని బద్దలు కొట్టి ఫస్ట్ టైటిల్ ముద్దాడిన ఆర్‌సీబీ.. ఈసారి కూడా అదే ఊపులో ఉంది. మరి ధోని, రోహిత్ ల తర్వాత వరుసగా రెండోసారి ఐపీఎల్ సామ్రాజ్యాన్ని ఏలబోయే ఆ మూడో కెప్టెన్‌గా పాటిదార్ నిలుస్తాడా లేదా అనేది రేపు రాత్రికి తేలిపోతది. 

►ALSO READ | టీమిండియా నుంచి గిల్, సూర్య ఔట్.. వైభవ్ కి రెడ్ కార్పెట్

లాస్ట్ బాల్ థ్రిల్లర్ రివెంజ్?: 
మరోవైపు శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఊరికే వదిలేలా లేదు.. వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్ కాబట్టి మస్తు కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. 2022లో ఐపీఎల్‌లోకొచ్చిన డెబ్యూ సీజన్ లోనే కప్పు కొట్టి రచ్చ లేపిన గుజరాత్, 2023లో కూడా వరుసగా రెండోసారి కప్ కొట్టేలా కనిపించింది. కానీ ఆ ఫైనల్లో సీఎస్‌కే చేతిలో లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో ఓడిపోయింది. 

కసితో రగిలిపోతున్న గిల్ సేన: 
మళ్లీ మూడేండ్ల తర్వాత గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్ లో అడుగు పెట్టింది. ఐదు సీజన్లలో వీరికి ఇది మూడో ఫైనల్ మ్యాచ్ కావడం విశేషం. క్వాలిఫయర్-1 లో ఆర్‌సీబీ చేతిలో ఓడిపోయినప్పటికీ, క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌ను ఓడించి, మళ్లీ గిల్ సేన ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కాబట్టి తమ సొంత స్టేడియంలో ఆర్‌సీబీని బోల్తా కొట్టించాలని గుజరాత్ టైటాన్స్ జట్టు కసితో ఉంది.