బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎప్పుడు ఏదో ఒక విషయంతో నెట్టింట్లో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా పురుషాధిక్యంపై బహిరంగంగా మాట్లాడి సంచలనం సృష్టించింది. "టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' టాక్ షోలో సినీ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కొన్ని సమస్కలను ప్రేక్షకులతో పంచుకుంది జాన్వీ 'నేను నెపోకిట్ నే. ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే నేను ఇండస్ట్రీకి వచ్చాను. కానీ నేను కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఇక్కడ రాణించాలంటే పురు షాహంకారాన్ని ఎదుర్కోవాలి. దీనిపై ఎన్నో పోరాటాలు చేశాను. అయినా మనల్ని పట్టించుకునే వారు ఉండరు.
నేను చెయను.. నాకు రాదు.. నాకు నచ్చలేదు అని చెప్పే బదులు దాని గురించి నాకు సరిగ్గా అర్థం అవ్వడం లేదు ప్యాకప్ అని చెప్పాల్సి వస్తుంది. ఒక్కోసారి మనల్ని మనమే తక్కువ చేసుకోవాలి. నలుగురు మహిళలు ఉన్న దగ్గర దగలం. కానీ నలుగురు పురుషులు ఒకే దగ్గర ఉన్నపుడు మాట్లాడడం చాలా కష్టం. ఎందుకంటే వారు నొచ్చుకోకుండా చెప్పాలి. మనం ఎదుటివారి కంటే అద్భుతంగా నటించగలం. కానీ, ఎంత టాలెంట్ ఉన్నా వారి ముందు తగ్గి ఉండాల్సిందే. కొన్నిసార్లు మౌనంగానూ ఉండి పోవాల్సి వచ్చింది. ఇలా ఎన్నో రాజు కీయాలను ఎదుర్కొన్నాను. ఇక్కడికి వచ్చాడే. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను' అంటూ చెప్పుకొచ్చింది.
ఇక సినిమాల విషయానికొస్తే... తాజాగా జాన్నీ రొమాంటిక్ కామెడీ మూవీ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' తో అలరించింది. ప్రస్తుతం తెలుగులో రామ్చరణ్, బుచ్చిబాబు కాంబోలో రామన్న 'పెద్ధి'లో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
