మస్క్​కు మస్తు సంపాదన.. నెలకు రూ.68 లక్షలు 

మస్క్​కు మస్తు సంపాదన.. నెలకు రూ.68 లక్షలు 

న్యూయార్క్​: ఎలన్​  మస్క్​ ట్విట్టర్​ను కొన్నాక చాలా మార్పులు తెచ్చారు. ఇందులో ముఖ్యమైనది మానిటైజేషన్ ఫీచర్. దీంతో యూజర్లు తమ కంటెంట్​ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఆసక్తికర సమాచారం, వీడియోలను అప్​లోడ్​ చేయడం ద్వారా డబ్బులు సంపాదించడానికి ట్విట్టర్​ అవకాశం కల్పిస్తోంది. మస్క్ కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా భారీగా సంపాదిస్తున్నారు.  అమెరికాలో ట్విటర్​ సబ్‌‌‌‌స్క్రిప్షన్ ధర నెలకు డాలర్లు 4.99.

ఇది ఇండియన్​ కరెన్సీలో దాదాపు రూ. 408. ఇందులో యాపిల్​ ఇన్​ యాప్​ పర్చేజ్​, ట్విట్టర్​ రెవెన్యూ షేరు పోను, ఒక్కో సబ్​స్క్రయిబర్​కు 3.39 డాలర్ల చొప్పున కంటెంట్​ క్రియేటర్​కు చెల్లిస్తారు. ఈ లెక్కన చూస్తే, ట్విట్టర్‌‌‌‌లో 24,700 సబ్‌‌‌‌స్క్రయిబర్లు ఉన్న మస్క్ నెలకు రూ.68,42,000 వరకు సంపాదిస్తున్నారు. అంటే టెస్లా చీఫ్ తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా ద్వారా సంవత్సరానికి దాదాపు రూ.8.2 కోట్లు సంపాదిస్తున్నాడు.   ఒక్కో యూజర్​ నుంచి రూ.277 తీసుకుంటున్నారు. మస్క్​ ట్విట్టర్​ బాస్​ అయ్యాక బ్లూటిక్స్​కు నెలకు కొంత మొత్తం చార్జ్​ చేస్తున్నారు.