కృష్ణా బేసిన్ అవతలికి నీళ్ల తరలింపు… లీగల్ ఎట్లయితది?

కృష్ణా బేసిన్ అవతలికి నీళ్ల తరలింపు…   లీగల్ ఎట్లయితది?

బచావత్‌’ అవార్డు పై ఎన్జీటీలో కృష్ణా బోర్డు తప్పుడు అఫిడవిట్‌!

కేవలం ఐదు ఔట్ లెట్లకు మాత్రమే ఓకే చెప్పిన బచావత్

ఇప్పుడు అన్నింటికీ ఆపాదిస్తూ బోర్డు కౌంటర్

నదీ బేసిన్అవతలికి నీటి తరలింపును లీగలైజ్ చేసేలా చర్యలు

ఏపీకి అనుకూలంగానే పని చేశారని తెలంగాణ ఇంజనీర్ల ఆగ్రహం

హైదరాబాద్‌, వెలుగు: సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌ ద్వారా బేసిన్‌ అవతలికి నీటి తరలింపు చట్టబద్ధమేనంటూ కృష్ణా బోర్డు కొత్త వివాదానికి తెరలేపింది. బచావత్‌ అవార్డులోనే అలా ఉందంటూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)లో దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్ లో పేర్కొంది. కృష్ణా బోర్డు సభ్యుడు హరికేశ్‌ మీనా ఈ అఫిడవిట్‌ ఫైల్‌ చేశారు. పిటిషనర్‌ లేవనెత్తినట్టుగా బేసిన్‌ అవతలికి కృష్ణా నీటి తరలింపు ఇల్లీగల్‌ కాదని, బచావత్‌ అవార్డు ఎనిమిదో చాప్టర్‌లోని పేజీ నం.128 దీనిపై స్పష్టతనిచ్చిందని అందులో పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ఇంజనీర్లు మండిపడుతున్నారు. బచావత్‌ రికమండేషన్స్ పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండానే కృష్ణా బోర్డు తప్పుడు అఫిడవిట్‌ ఫైల్‌ చేసిందని మండి పడుతున్నారు. ఏపీకి అనుకూలంగా ఉండేందుకు బచావత్‌ అవార్డుకే తప్పులు ఆపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్నింటికీ వర్తింపజేసిన బోర్డు

దక్షిణ తెలంగాణకు నష్టం చేసేలా ఏపీ సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌ స్కీం, పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టులను చేపట్టిందని.. చట్టవిరుద్ధం గా పెన్నా బేసిన్​కు కృష్ణా నీటిని తరలిస్తోందని నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్జీటీలో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. దానిపై కౌం టర్‌‌ అఫిడవిట్‌‌ దాఖలు చేసిన కృష్ణా బోర్డు.. బేసిన్‌‌ అవతలికి నీటి తరలిం పు చట్టబద్ధమేనని ఎన్జీటీకి తెలిపిం ది. ఇందుకు బచావత్‌‌ అవార్డులోని ఓ చిన్న డైరెక్షన్ ను ముందు పెట్టింది. కేవలం అప్పటికే నీళ్లు తరలించుకుంటున్న ఐదు పాయింట్ల (కాల్వలు)కు బచావత్ అవార్డు చాన్స్​ ఇస్తే.. ఏకంగా అన్నిచోట్లా నీటి తరలిం పును చట్టబద్ధం చేసేలా కృష్ణా బోర్డు అఫిడవిట్‌‌ వేసింది. దీనిపై తెలంగాణ ఇంజనీర్లు మండిపడుతున్నారు. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకు సాగు, తాగునీటి కోసం పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలిస్తున్నారని.. కొత్తగా చేపట్టే సంగమేశ్వరం ద్వారా ఆ ప్రాజెక్టు లకే నీళ్లిస్తామని ఏపీ చెప్తోందని అంటున్నారు. ఇన్నాళ్లూ అక్రమంగా నీళ్లు తరలిం చుకున్న ప్రాజెక్టులను ఇప్పుడు లీగల్‌‌ చేసేలా కృష్ణాబోర్డు వ్యవహరించిందని స్పష్టం చేస్తున్నారు.

మొదటి నుంచీ ఇదే తీరు

కృష్ణాబోర్డు మొదటి నుం చీ ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ వాటర్‌‌  ఇయర్‌‌లో నే పలు సందర్భాల్లో ఇది కన్ఫామ్ అయ్యింది. ఏపీ జస్ట్​ వాట్సాప్‌‌  మెసేజ్‌‌ పంపడంతోనే.. శ్రీశైలం లెఫ్ట్‌‌ పవర్‌‌ హౌస్‌‌లో కరెంట్‌‌ ఉత్పత్తి ఆపేయాలంటూ బోర్డు తెలంగాణను ఆదేశించింది. మరోసారి దానిపై రిమైండర్‌‌ రాసి.. తర్వాత తమ ఆదేశాలను తెలంగాణ పట్టించుకోవట్లేదంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసిం ది. శ్రీశైలంలో ఉత్పత్తయ్యే కరెంట్‌‌ ను రెండు రాష్ట్రాలు సమంగా పంచుకోవాలి. వాటర్‌‌ ఇయర్‌‌ ముగిసే సమయానికి కరెంట్‌‌ ఉత్పత్తి లెక్కలు సరిచూసుకొని హెచ్చుతగ్గులు ఉంటే సరిచేసుకోవాలి. కానీ సీజన్‌‌ మొదట్లో నే ఏపీ లేఖలపై కేం ద్రానికి ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది. ఇప్పుడు ఏపీ అక్రమ ప్రాజెక్టులకు నీళ్ల తరలింపును సక్రమం చేయడానికి ఏకంగా బచావత్‌‌ అవార్డును ముందుపెట్టింది.

పోతిరెడ్డిపాడు నీళ్ల లెక్కలపై ఆరా తీయరేం?

పోతిరెడ్డిపాడు నుం చి ఏపీ తీసుకుంటున్న నీటి లెక్కలను తప్పుగా చూపుతున్నా బోర్డు ఇంతవరకూ అడగలేదు. బుధవారం పోతిరెడ్డిపాడు నుం చి 14 వేల క్యూ సెక్కు లకు పైగా నీళ్లను తరలించినా, కేవలం 7 వేల క్యూసెక్కు లే తీసుకుంటున్నట్టు ఏపీ లెక్క చూపుతోంది. అది తప్పని తెలిసినా కచ్చితమైన లెక్క చెప్పాలని బోర్డు ఏపీని అడిగే ప్రయత్నం చేయడం లేదు. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి బోర్డు వేగంగా స్పందిస్తూ బ్రేకులు వేయడానికి ప్రయత్ని స్తోంది.

బచావత్ అవార్డు 8వ చాప్టర్‌‌ ఏం చెప్తోంది ?

జస్టిస్‌‌ బచావత్‌‌ అవార్డులోని 8వ చాప్టర్‌‌ పేజీ నం. 128 ప్రకారం.. బేసిన్‌‌ అవతలికి నీటి తరలింపు చట్టబద్ధమని కృష్ణాబోర్డు చెప్తోంది.అయితే అదే పేజీలోని పార్ట్‌‌–2లో కృష్ణా డెల్టా కెనాల్స్‌‌, కర్నూల్‌‌ కడప కెనాల్‌‌, నాగార్జునసాగర్‌‌ కుడి కాల్వ, తుం గభద్ర కుడి హైలెవల్‌‌ కెనాల్, గుం టూర్‌‌ కెనాల్‌‌ ద్వారా మాత్రమే బేసిన్‌‌ అవతలికి కృష్ణా నీటిని తరలించాలన్న రూల్ ఉంది. బచావత్‌‌ ట్రిబ్యునల్‌‌ ఏర్పాటయ్యే నాటికే ఆయా పాయిం ట్ల నుంచి బేసిన్‌‌ అవతలికి నీటిని తరలిస్తున్నా రు. దాంతో వాటిని చర్చించిన ఫైండింగ్స్‌‌గా మాత్రమే ప్రస్తావించింది. బేసిన్‌‌ అవసరాలు తీరాకే ఆయా పాయింట్ల ద్వారా బేసిన్‌‌ అవతలికి నీటిని తీసుకోవచ్చంది.కానీ మొత్తంగా బేసిన్ అవతలికి నీటి తరలింపు లీగల్ అనేలా కృష్ణాబోర్డు వ్యవహరిస్తోంది.