అప్పుల్లో తమిళనాడు టాప్.. 11వ ప్లేస్ లో తెలంగాణ

అప్పుల్లో తమిళనాడు టాప్.. 11వ ప్లేస్ లో తెలంగాణ

దేశంలోని ఏయే రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయనే దానిపై లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం బదులిచ్చింది. రాష్ట్రాలవారీగా అప్పుల జాబితాను కేంద్ర ఆర్థిక శాఖ  విడుదల చేసింది. దీని ప్రకారం.. దేశంలో అత్యధికంగా అప్పులున్న రాష్ట్రాల జాబితాలో తొలి మూడు స్థానాల్లో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. వీటి అప్పు సగటున రూ.6 లక్షల కోట్లకుపైనే ఉంది. ఎనిమిదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు రూ.3.98 లక్షల కోట్ల అప్పులు, 11వ స్థానంలో ఉన్న తెలంగాణకు రూ.3.12 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఇక జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ కు రూ.5.62  లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు రూ.4 లక్షల కోట్లకుపైగా రుణాలు ఉన్నాయి. కేరళ, మధ్యప్రదేశ్  రూ.3 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశాయి. రూ.15వేల కోట్లలోపు అప్పులున్న వాటిలో మేఘాలయ,  నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, సిక్కిం ఉన్నాయి. 

రాష్ట్రాలవారీగా అప్పులు (రూ.లలో)

తమిళనాడు :  6,59,868 కోట్లు
ఉత్తరప్రదేశ్ :   6,53,307 కోట్లు
మహారాష్ట్ర   :   6,08,999 కోట్లు
పశ్చిమ బెంగాల్  :   5,62,697 కోట్లు
రాజస్థాన్  :    4,77,177 కోట్లు
కర్ణాటక  :    4,62,832 కోట్లు
గుజరాత్  :    4,02,785 కోట్లు
ఆంధ్రప్రదేశ్  :    3,98,903 కోట్లు
కేరళ  :    3,35,989  కోట్లు 
మధ్యప్రదేశ్  :    3,17,736 కోట్లు
తెలంగాణా  :    3,12,191 కోట్లు
హర్యానా  :    2,79,022 కోట్లు
పంజాబ్  :    2,82,864 కోట్లు
బీహార్  :    2,46,413 కోట్లు
ఒడిషా  :   1,67,205 కోట్లు
జార్ఖండ్ :    1,17,789 కోట్లు
ఛత్తీస్ గఢ్  :   1,14,200 కోట్లు
అస్సాం  :    1,07,719 కోట్లు
ఉత్తరాఖండ్  :    84,288 కోట్లు
హిమాచల్ ప్రదేశ్  :    74,686 కోట్లు
గోవా  :    28,509 కోట్లు
త్రిపుర :  23,624  కోట్లు
మేఘాలయ : 15,125 కోట్లు
నాగాలాండ్ :  15,125 కోట్లు
అరుణాచల్ ప్రదేశ్ :  15, 122 కోట్లు
మణిపూర్:  13,510 కోట్లు
మిజోరాం:  11,830 కోట్లు
సిక్కిం:  11,285 కోట్లు