ఒక్కో వ్యక్తికి.. ఎక్కడ.. ఎంత నీళ్లు అవసరం?

ఒక్కో వ్యక్తికి.. ఎక్కడ.. ఎంత నీళ్లు అవసరం?
  •     దేశంలోని ప్రతి ఒక్కరు రోజుకు నార్మల్​గా 135 లీటర్ల నీళ్లను ఉపయోగిస్తుంటారు. 
  •     సినిమా హాళ్లు, బంకెట్ హాల్స్​లో ఉన్న ఒక్కో సీటులో కూర్చునే వ్యక్తి 15 లీటర్ల నీళ్లు యూజ్ చేస్తుంటాడు.
  •     ఫ్యాక్టరీల్లో పని చేసే ఒక్కో కార్మికుడు రోజుకు 50 లీటర్ల నీళ్లు వాడుకుంటున్నాడు.
  •     100 బెడ్స్ కంటే తక్కువ ఉన్న హాస్పిటల్స్​లో ఒక్కో బెడ్ కోసం 340 లీటర్ల నీళ్లు వినియోగిస్తున్నారు.
  •     100 బెడ్స్​ కంటే ఎక్కువ ఉన్న హాస్పిటల్స్​లో అయితే.. 450 లీటర్లు వరకు వాడుకుంటున్నారు.
  •     హాస్టల్స్​లో ఒక్కో వ్యక్తి 135 లీటర్లు, హోటల్​లో ఉన్న వ్యక్తి రోజుకు 180 లీటర్లు ఉపయోగిస్తున్నాడు.
  •     ఆఫీసుల్లో అయితే.. ఒక్కో ఎంప్లాయ్ 45 లీటర్లు వాడుకుంటాడు.
  •     రెస్టారెంట్స్​లో 70 లీటర్లు, స్కూల్స్​లో స్టూడెంట్స్ 45 లీటర్లు వినియోగిస్తున్నారు.

ఇంట్లో ఒక వ్యక్తి యూజ్ చేసే వాటర్​(లీటర్లలో)

  •     తాగడానికి 5, వంట కోసం 5, స్నానానికి 55, బట్టలు వాష్ చేసుకోవడానికి 20 లీటర్లు ఉపయోగిస్తాడు.
  •     బౌల్స్​ వాషింగ్​కు 10 లీటర్లు, ఇల్లు కడిగేందుకు 10 లీటర్లు, టాయిలెట్​లో ఫ్లష్​ యూజ్ చేస్తే 30 లీటర్లు. మొత్తంగా ఒక్క వ్యక్తికి సగటున రోజుకు 135 లీటర్ల నీళ్లు అవసరం అవుతాయి.