ఈరోజుల్లో టెక్నాలజీ అభివృద్ధి చెందటంతో పాటు ఏఐ రాకతో మోసగాళ్లు నకిలీ ట్రేడింగ్ యాప్స్, వెబ్ సైట్లు సృష్టించి ఇన్వెస్టర్లను అడ్డంగా దోచేస్తున్నారు. దీనికి సోషల్ మీడియాను నేరగాళ్లు విరివిగా వినియోగిస్తున్నారు. మరికొన్ని సార్లు ఫ్రీ గిఫ్ట్ కార్డులు, స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లు అంటూ వలవేసి మెుత్తం డబ్బు ఊడ్చేస్తున్నారు. అయితే కొత్తగా ట్రేడింగ్ లోకి వస్తున్న ఇన్వెస్టర్లు ఇలాంటి మోసగాళ్ల వలలో పడకుండా తాము ట్రేడింగ్ చేస్తున్న ఫ్లాట్ ఫారం, యాప్స్, వెబ్ సైట్లు అసలైనవో కాదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం...
ముందుగా మీరు ట్రేడింగ్ యాప్ ఎంపిక చేసుకునేటప్పుడు యాప్ స్టోర్ నుంచి సరైన అథెంటిక్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవటం చాలా ముఖ్యం. దీని కోసం ముందుగా స్టాక్ ఎక్స్ఛేంజీల అధికారిక వెబ్ సైట్ లేదా సెబీ ఇన్వెస్టర్ వెబ్ సైట్ నుంచి రిజిస్టర్డ్ మెుబైల్ ట్రేడింగ్ యాప్స్ సెక్షన్ కి వెళ్లండి. అక్కడ యాప్ డెవలపర్ వివరాలు, కస్టమర్ సపోర్ట్, అధికారిక వెబ్ సైట్ డిటైల్స్ పరిశీలించాకే నిర్ణయం తీసుకోండి. ఎప్పుడైనా అధికారిక బ్రోకరేజ్ వెబ్ సైట్ నుంచి యాప్ లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవటం సేఫ్ అని నిపుణులు సూచిస్తున్నారు.
ఇన్వెస్టర్లు ఆన్ లైన్ మోసాల నుంచి తమను తాము రక్షించుకోవాలంటే ఈ 3 విషయాలు తప్పకుండా ఖచ్చితంగా చేయాలి..
1. ముందుగా పెట్టుబడికి ముందే సదరు బ్రోకరేజ్ రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవటం కోసం SEBI portal: https://www.sebi.gov.in/intermediaries.html లింక్ లో వివరాలు పరిశీలించండి.
2. కేవలం అధికారిక బ్రోకరేజ్ యాప్స్, ట్రేడింగ్ ఫ్లాట్ ఫారం ద్వారా మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేపట్టడం కోసం అవి నిజమైనవో కావో https://investor.sebi.gov.in/Investor-support.html ఇందులో పరిశీలించండి.
3. సురక్షితమైన పెట్టుబడిదారుల చెల్లింపుల కోసం https://siportal.sebi.gov.in/intermediary/sebi-check ని సందర్శించడం ద్వారా లేదా Saarthi యాప్ ద్వారా ధృవీకరించబడిన UPI హ్యాండిల్స్ నుంచే ట్రేడింగ్ చేపట్టండి.
ఇదే క్రమంలో మార్కెట్ లెగ్యులేటరీ సంస్థ సెబీ సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను మోసగాళ్ల నుంచి ఇన్వెస్టర్లను కాపాడేందుకు సహకారం కోరింది. తమ ఫ్లాట్ ఫారంలపై మోసగాళ్ల చర్యలను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. అలాగే సెబీ ద్వారా రిజిస్ట్రర్ చేయబడిన సంస్థలు మాత్రమే పెట్టుబడి ఉత్పత్తుల గురించి యాడ్స్ ఇచ్చేందుకు వీలుగా విధాన మార్పులు చేపట్టింది.
