Vastu tips: అన్నదమ్ములు ఇంటిని ఎలా పంచుకోవాలి.. ఎవరు ఎక్కడ ఉండాలి..

Vastu tips:  అన్నదమ్ములు ఇంటిని ఎలా పంచుకోవాలి.. ఎవరు ఎక్కడ ఉండాలి..

వారసత్వంగా తండ్రి.. తాతలు సంపాదించిన ఇంటిని.. ఆస్తిని అన్నదమ్ములు ఎప్పటికైనా పంచుకోవాల్సిందే.  కొంతమంది మొండిగా వాస్తు ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు పంచుకుంటారు.   అలాంటి వారికి ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని వాస్తు పండితులు అంటున్నారు.  వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ గారి సూచనల మేరకు అన్నదమ్ములు  ఏ దిక్కులో నివసించాలి.. ఇంటిని ఎలా పంచుకోవాలో తెలుసుకుందాం. . .

ప్రశ్న: మేం ఇద్దరం అన్నదమ్ములం. నేను తమ్ముడిని, ఆస్తి పంపకాల్లో తూర్పున ఉన్న ఇల్లు తీసుకున్నాను. ఇంటి నిర్మాణం మార్చి, వాకిలి తూర్పు దిక్కులో కట్టుకున్నా. దాంతో అన్న ఇంటి ముందు నుంచి నడవాల్సి వస్తుంది. తమ్ముడు ఎగువ ఇంట్లో ఉండకూడదని అంటున్నారు. ఇప్పుడు ఇల్లు మారే పరిస్థితి లేదు. నాకు సలహా ఇవ్వండి? 

జవాబు: ఆస్తి పంపకాల్లో అయినా సరే పెద్దవాడు ఎప్పుడూ పడమర ఉండాలి. చిన్నవాడు కింద తూర్పు వైపు ఉండాలి. మీరు దానికి విరుద్ధంగా ఆస్తి పంపకాలు చేసుకున్నారు. ఇలా చేసుకోవడం వల్ల ఇద్దరికీ ఆర్థికంగా ఎదుగుదల ఉండదు. ఇద్దరూ మారడం మంచిది. దక్షిణం వైపు దారి వదులుకోవడం కూడా మంచిది కాదు. ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఉంటే, అటువైపు దారి పెట్టుకోండి. కొంత వరకు మేలు జరగొచ్చని వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ అంటున్నారు. 

 

 

 వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​