Zoho మెయిల్‌కి అన్ని Gmail ఈమెయిల్స్ ను.. ఒకేసారి ఇలా ఈజీగా ఫార్వార్డ్ చేసుకోండి

Zoho మెయిల్‌కి అన్ని Gmail ఈమెయిల్స్ ను.. ఒకేసారి ఇలా ఈజీగా ఫార్వార్డ్ చేసుకోండి

భారతీయ కంపెనీ జోహో గ్రూప్ నుంచి వచ్చిన జోహో మెయిల్ సర్వీస్​, దాని మేసేజింగ్​ యాప్​ అరట్టై రెండూ మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రముఖులు కూడా జోహో ఈమెయిల్​, మేసేజింగ్​ యాప్​ ఖాతాలను ఓపెన్​ చేశారు. రోజురోజుకు zoho మెయిల్స్​ క్రేజ్​ పెరుగుతోంది. ఇటువంటి సందర్భంలో జోహో మెయిల్​ఖాతాను ఓపెన్ చేయడం, Gmail నుంచి Zoho  మెయిల్ ఖాతాకు అన్ని మేసేజ్​ లను పంపించడం ఎలా అనే సందేహం రావచ్చు. ఈ ప్రక్రియ చాలా సులభం. దీంతోపాటు Gmail అడ్రస్​ కు ఫ్యూచర్ లో పంపబడే అన్ని ఇమెయిల్స్​ వాటంతట అవే జోహో మెయిల్‌కు ఫార్వార్డ్ చేసుకోవచ్చు. దీనికోసం ఓ చిన్న సెట్టింగ్‌ను మార్పు  చేస్తే చాలు. ఈ ఫీచర్ మీ ఫోన్‌లో కాల్ ఫార్వార్డింగ్ లాగా పనిచేస్తుంది. పూర్తి వివరాలు.. 

Zoho మెయిల్ ఖాతాకు అన్ని Gmail ఇమెయిల్స్​ను ఎలా ఫార్వార్డ్ చేయాలంటే.. 

  • Gmail నుంచి Zoho మెయిల్‌కు ఇన్‌కమింగ్ ఇమెయిల్స్​మళ్లించేందుకు  ముందుగా మీ Gmail ఖాతాలో ఇమెయిల్ ఫార్వార్డింగ్ సెట్టింగ్‌లను ఓపెన్ చేయాలి. 
  • మీ Gmail ఖాతాకు లాగిన్ అవ్వాలి. 
  • సెట్టింగ్‌లోకి వెళ్లి see All settings ను ఎంపిక చేసుకోవాలి. 
  • ఫార్వార్డింగ్, POP/IMAP ట్యాబ్‌కు నావిగేట్ చేయాలి. 
  • ఎగువన ఉన్న ఫార్వార్డింగ్ విభాగంలో Add a forwarding address క్లిక్ చేసి, మీ జోహో మెయిల్ IDని ఎంటర్​ చేయాలి. 
  • అప్పుడు Gmail మీ Zoho మెయిల్ ఖాతాకు కన్ఫర్మేషన్​ లింక్‌తో test email ను పంపుతుంది.
  • జోహో మెయిల్‌లో వచ్చిన కన్ఫర్మేషన్​ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత email forwarding option ఎనేబుల్​ అవుతుంది. 
  • ఈ దశలను పూర్తి చేసిన తర్వాత మీ Gmail చిరునామాకు పంపబడిన అన్ని ఇన్‌కమింగ్ ఇమెయిల్‌లు  ఒక్కొక్కటిగా మీ Zoho మెయిల్ ఇన్‌బాక్స్‌కు వస్తాయి.